TDP-Janasena: పొత్తులు ఓకే.. సంత‌కాల మాటేంటి.. పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబుతారా?

TDP-Janasena: వచ్చే ఏడాది ఎన్నికల మాటేమో గానీ రాజకీయాలు మాత్రం తెగ వేడెక్కిపోతున్నాయి. ఏ నిమిషాన ఏం జరుగుతుందో రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పలేని పరిస్థితి. ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు అరెస్టుతో మరింత వేడెక్కాయి రాజకీయాలు. అలాగే ఇన్నాళ్లు పొత్తుల గురించి మాట్లాడుతూ మరోవైపు తన సొంత మేనిఫెస్టో గురించి చెప్పుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్. తను అధికారంలోకి రాగానే తను పెట్టబోయే మొదటి సంతకం సుగాలి ప్రీతికి న్యాయం జరిగేలా చేస్తాను.

దానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెడతాను అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అలాగే తన రెండవ సంతకం కౌలు రైతులకు సంబంధించిన ఫైల్ పై సంతకం పెడతానని చెప్పుకొచ్చాడు. అలాగే మూడవ సంతకం యువతకు ఉపాధి కల్పించే విషయమై ఉంటుందని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇదంతా తన సొంత మేనిఫెస్టో. మరి ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు కుదిరినప్పుడు మేనిఫెస్టోలో ప్రయారిటీలు మారిపోతే అప్పుడు తను ఇచ్చిన మాట సంగతి ఏమిటి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అలాగే చంద్రబాబు నాయుడు కూడా తను అధికారంలోకి వస్తే అలా చేస్తాను ఇలా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే పక్క పార్టీతో పొత్తుకుదుర్చుకున్నప్పుడు ప్రయారిటీలు మారిపోతాయి కదా దాని సంగతేమిటి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు పవన్ కళ్యాణ్ బీజేపీ తో కూడా పొత్తు పెట్టుకోవడానికి పావులు కదుపుతున్నాడు. ఒకవేళ బీజేపీ కనుక ఈ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటే ఉచితాలకు వ్యతిరేకం అంటున్న ఆ పార్టీ వీరి మేనిఫెస్టోలకు ప్రయారిటీ ఇస్తుందా..

ఈ ప్రశ్నలన్నింటికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారా లేదంటే మళ్లీ చంద్రబాబు నాయుడుతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారా? ఇవన్నీ తెలియాలంటే మరి కొంతకాలం వేచి ఉండాల్సిందే. అసలు చంద్రబాబు నాయుడు బయటికి వచ్చే విషయమే పెద్ద మిస్టరీ అయి కూర్చుంది. మరి పవన్ కళ్యాణ్ ఇదే విషయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -