Nannuri Narsi Reddy: అమ్మకు పదవి పాయె.. చెల్లికి ఆస్తి పాయె.. జగన్ పాలనపై నర్సిరెడ్డి సెటైర్లు వైరల్!

Nannuri Narsi Reddy:  పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రజాగళం.. గురజాల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సభలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత నర్సిరెడ్డి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. చంద్రబాబు హయాంలో రెండు డీఎస్సీలు వేస్తే జగన్ ఒకటి కూడా పూర్తి చేయలేదు, తెలుగుదేశం ప్రభుత్వం 4.32 లక్షల మందికి నిరుద్యోగ భృతి చెల్లిస్తే దాన్ని కూడా తీసివేశారు.

ఐదేళ్లలో జగన్ ప్రజలకు కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్, మాట్లాడితే షాకింగ్ న్యూస్, మెరుపుతీగ వచ్చినట్లు పరదాల మధ్యన వచ్చిపోతున్నారు. జగన్ కి ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగు, నదిలో ఇసుక, గుడిలో విగ్రహాలు పోయాయి. అమ్మకు గౌరవ అధ్యక్ష పదవి పోయింది, చెల్లికి ఆస్తి పోయింది, బాబాయి పైకి పోయాడు, బాబు జైలుకు పోయాడు. రాజశేఖర్ రెడ్డి కుమారుడని నమ్మిన పాపానికి మనల్ని అమ్మేసిన దుష్టుడు జగన్ అంటూ ఆవేశంగా మాట్లాడారు.

రాష్ట్రంలో బడిలో పిల్లోడికి గుడిలో దేవుడికి రక్షణ లేదు, పట్టపగలు వీధిలోకి వెళ్లినోడు ఇంటికి చేరే గ్యారెంటీ కూడా లేదు. అలాగే జగన్ 99.5% హామీలు అమలు చేశానని చెబుతున్నారు కానీ 730 హామీలు ఇచ్చి 85 శాతం కూడా అమలు చేయలేదు. 2.30 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? 1.40 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు ఏమయ్యాయి?మెగా డీఎస్సీ ఏది, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏది, రైల్వే జోన్ రాలేదు, ప్రత్యేక హోదా రాలేదు, కడపకి ఉక్కు ఫ్యాక్టరీ తేలేదు.

తనకి టీవీ పత్రిక లేవని చెప్పుకునే జగన్ బెంగళూరులో వెయ్యి ఎకరాల భూమి గురించి, కోట్ల ఖరీదు చేసే కాంప్లెక్స్ గురించి, హైదరాబాదులో 60 ఎకరాల జాగా గురించి, బ్రాహ్మణి స్టిల్స్ రఘురాం సిమెంట్, కర్ణాటక, సిక్కిం లో పవర్ ప్రాజెక్టుల గురించి అడిగితే మాత్రం సరైన సమాధానంఉండదు. ఆస్తిలో వాటా అడిగితే చెల్లెలు గొంతుకు పట్టుకున్న అన్న జగన్ అంటూ జగన్ ని ఏకి పారేశారు నర్సిరెడ్డి. ఇప్పుడు ఈ స్పీచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిలకు డిపాజిట్ రాదట.. బాధగా ఉందట.. జగన్ మొసలి కన్నీరు వెనుక లెక్కలివేనా?

CM Jagan: రాజకీయాలు కుటుంబ సభ్యులను సైతం బద్ధ శత్రువులుగా మారుస్తుందని విషయం మరొకసారి రుజువయింది. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయి బహిరంగంగానే ఒకరిని ఒకరు...
- Advertisement -
- Advertisement -