Jr NTR: ఎన్టీఆర్ నందమూరి వంశమేనా.. మరోసారి తెరపైకి ఎన్టీఆర్ స్టోరీ?

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడంటే నందమూరి వారసుడిగా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు కానీ ఈయన ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ సాధించలేకపోయినంత వరకు అసలు ఎన్టీఆర్ తమ కుటుంబానికి చెందిన వాడు కాదని అసలు ఆయన నందమూరి వంశమే కాదంటూ ఎంతోమంది ఆయనను బాధపెట్టారు. ఇలా చిన్నప్పుడు ఎన్టీఆర్ తన తండ్రి ఆలనా పాలనకు దూరంగా ఉండి ఎంత బాధను అనుభవించారో అందరికీ తెలిసిందే.

ఎన్టీఆర్ నందమూరి హరికృష్ణ రెండో భార్య శాలినికి పుట్టిన కుమారుడు. ఇలా ఇంట్లో తెలియకుండా హరికృష్ణ రెండవ వివాహం చేసుకోవడంతో వారికి జన్మించిన కుమారుడు ఎన్టీఆర్ ని కూడా తమ కుటుంబ సభ్యులుగా నందమూరి ఫ్యామిలీ అంగీకరించలేదు. ఇక ఎన్టీఆర్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించక ముందు వరకు కళ్యాణ్ రామ్ సైతం తానే నందమూరి వారసుడు అంటూ బల్లగుద్ది చెప్పారు. ఇక ఈయన ఇండస్ట్రీలో సక్సెస్ అయిన తర్వాత ఆయన నందమూరి హీరో అంటూ అందరూ చెబుతున్నారు కానీ ఇదివరకు ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

ఇకపోతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంతో ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కారణంగా మరోసారి ఎన్టీఆర్ గతం గురించి ప్రస్తావన తీసుకువస్తున్నారు.ఈ క్రమంలోనే అసలు ఎన్టీఆర్ నందమూరి వంశమేనా తన తాత పేరును తొలగిస్తుంటే ఈయన ఇలాంటి ట్వీట్ చేయడంతో అందరికీ ఇలాంటి అనుమానాలు మొదలవుతున్నాయి అంటూ పచ్చ బ్యాచ్ ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ పై ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మరోసారి తెలుగుదేశం నేతలు నందమూరి అభిమానులు ఎన్టీఆర్ గురించి ఆయన గతం గురించి ప్రస్తావిస్తూ ఆయనని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని డై హార్ట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి జీర్ణించుకోలేకపోతున్న కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ పై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి ఈయూనివర్సిటీ వివాదం ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -