TDP: ఆ రెండు సీట్లలో టీడీపీదే విజయమట.. వైసీపీ చేస్తున్న తప్పులే ప్లస్ అయ్యాయా?

TDP: మే 13 వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఈ విధంగా అన్ని ప్రాంతాలలో ప్రచార కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి. అయితే ఎక్కడ ఎలా ఉన్నా రెండు నియోజకవర్గాలలో మాత్రం వైసిపి గోల్డెన్ ప్లేట్లో పెట్టి మరి టిడిపికి విజయాన్ని అందిస్తున్నాయని తెలుస్తుంది. మరి ఆ రెండు నియోజకవర్గాలు ఏవి అనే విషయానికి వస్తే ఒకటి పరిచూరు రెండు అద్దంకి.

అద్దంకిలో టీడీపీ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి పోటీ చేస్తున్నారు. ఓవ‌రాల్‌గా నాలుగుసార్లు అద్దంకిలోనే వ‌రుస‌గా పోటీ చేసి మూడుసార్లు విజయం అందుకున్నారు అయితే ఈసారి ఈయన పోటీకి దిగుతున్నారు అయితే ఇక్కడ పార్టీల పరంగా కాకుండా వ్యక్తి పరంగా వ్యక్తి బలాలను బట్టి అక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు గొట్టిపాటి రవి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి మరి గెలిచారు అంటేనే ఇక్కడ ఈయనకు ఏ విధమైనటువంటి ఆదరణ ఉందో స్పష్టంగా తెలుస్తుంది.

పైగా ఈయనకి పోటీగా వైసిపి నుంచి పాణెం చిన హ‌నిమిరెడ్డి అనే నాన్ లోక‌ల్‌ను రంగంలొకి దింపింది. ఆయ‌న ఎక్క‌డో గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతం పెద‌కూర‌పాడు నియోజ‌క‌ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో గొట్టిపాటి రవి విజయం పక్కా అనే స్పష్టమవుతుంది. ఇక అద్దంకిలో మాత్రమే కాకుండా పరచూరిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.2014లో తొలి సారి టీడీపీ టికెట్ పై ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్న ఏలూరి సాంబ‌శివ‌రావు..

అతి తక్కువ సమయంలోనే ఈయన త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుని.. పార్టీల‌కు అతీతంగా ముందుకు సాగారు. ఇకపోతే 2019 ఎన్నికలలో కూడా ఈయన టిడిపి పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అంటున్నారు స్థానికులు. ఇక‌, వైసీపీ నుంచి ఎడ‌మ బాలాజీ పోటీ చేసినా.. కేవ‌లం ఆయ‌న పోటీ ఉన్నారంటే ఉన్నార‌నే వాద‌నే వినిపిస్తోంది. గెలుపు ఏక‌ప‌క్ష‌మ‌నే లెక్క‌లు వ‌స్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -