Asia Cup 2022 : రెండో వన్డేపై టీమిండియా కన్ను.. సిరీస్ మనదేనా?

Asia Cup 2022 : టీమిండియా వరుస మ్యాచ్ లతో జోరుందుకుంది. వరుస సిరీస్ లు, పర్యటనలతో బిజీబిజీగా ఉంది. ఒక సిరీస్ అవ్వగానే మరో సిరీస్, ఒక పర్యటన కాగానే మరో పర్యటన.. ఇలా టీమిండియా వరుస మ్యాచ్ లతో క్రికెట్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక పర్యటనలు ముగియగా.. అన్ని మ్యాచ్ లలోనూ టీమిండియా ఆధిపత్యమ కనిపించింది.

అయితే ప్రస్తుతం జింబాబ్వేతో టీమిండియా మ్యాచ్ లు ఆడుతుంది. గురువారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవ్వగా.. తొలి మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. గురువారం జరిగిన తొలి వన్డేలో ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మొత్తం వన్డే మ్యాచ్ లు ఆడనుండగా.. తొలి మ్యాచ్ టీమిండియా గెలవడంతో 1-0తో ఆధిక్యంతో ఉంది. ఇక శనివారం రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ ను గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.

తొలి మ్యాచ్ లో దీపక్ చాహర్, ప్రసిద్ధ్, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ మాత్రమే తీశాడు. అయితే కుల్ దీప్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో ఈ మ్యాచ్ అతడు పంజుకోవాల్సి ఉంది. ఇక బ్యాటింగ్ విభాగంలో భారత్ బలంగానే ఉంది. జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానకి లేదు. బంగ్లాదేశ్ తో జింబాబ్వే పోరాటం గురించి తెలిసిందే. ఎప్పుడైనా జింబాబ్వే పుంజుకోవచ్చు.

తొలి వన్డేలో జింబాబ్వే టాప్ ఆర్డర్ కూలిపోయినా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన బ్రాడ్ ఇవాన్స్-ఎన్ గరవ 70 పరుగులు చేశాడు. దీనిని బట్టి చూస్తే జింబాబ్వే బ్యాటింగ్ ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపెనర్ గా వచ్చే శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్ వీలైనన్నీ పరుగులు చేస్తే.. ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు ఒత్తిడి లేకుండా ఆడుకోవచ్చు. ఇక గాయం నుంచి కోలుకుని జింబాబ్వే వన్డే సిరీస్ కుక కెప్టెన్ గా ఎంపిక అయిన కేఎల్ రాహుల్ ఆటపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ కూడా రెండో వన్డేలో అవకాశం వస్తుందా.. లేదా అనేది చూడాలి..

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -