Rahul Jodo Yatra: రాహుల్ జోడో యాత్రపై టీ కాంగ్రెస్ ఆశలు.. పార్టీ పంజుకుంటుందా?

Rahul Jodo Yatra: టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంట్రీతో టీ కాంగ్రెస్ బలం పుంజుకున్నట్లు కనిపించింది. రేవంత్ రెడ్డి దూకుడుతో పార్టీ కొద్దిరోజుల పాటు బలంగా కనిపించింది. పార్టీ క్యాడర్ లో కూడా జోష్ వచ్చింది. కానీ ఆ జోష్ ఎక్కువ రోజులు నిలవలేదు. పీసీసీ చీఫ్ గా రేవంత్ ఎంపిక కావడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది నేతలు ఆయనకు సహకరించకుండా ఇబ్బందులకు గురి చేస్తోన్నారు. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను తప్పుబడుతూ కేంద్ర అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రేవంత్ కు యాంటీగా ఏర్పడి ఢిల్లీ హైకమండ్ కు వరుస ఫిర్యాదు చేస్తున్నారు. నేతలు వరుస బెట్టి రేవంత్ తీరుపై విమర్శలు చేస్తుండటంతో.. ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

నేతల మధ్య విబేధాలు, ఒకరంటే ఒకరికి పొసగకపోవడంతో టీ కాంగ్రెస్ చితికిలపడిపోయింది. దీంతో రాహుల్ జోడో యత్రపై టీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు. రాహుల్ పాదయాత్రతో అయినా టీ కాంగ్రెస్ లోని నేతల మధ్య విబేధాలు తొలగిపోయి నేతలందరూ కలిసిపోతారని కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు. నేతల మధ్య రాహుల్ సయోధ్య కుదుర్చుతారని, పార్టీ నేతలందరూ కలిసి పనిచేసేలా చేస్తారని కార్యకర్తలలో ఆశ నెలకొంది. అస్తవస్తంగా తయారైన తెలంగాణ కాంగ్రెస్ ను ఆయన లైన్ లో పెడతారని, దీని ద్వారా పార్టీ పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. నేతల మధ్య విబేధాలు సమిసిపోతాయని, నేతలందరూ ఏకతాటిపైకి వస్తారని చెబుతున్నారు.

ఆదివారం కర్ణాటక నుంచి తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మక్తల్ నుంచి రాహుల్ జోడో యాత్ర తెలంగాణలో ప్రారంభం అయింది. తొలిరోజు 4 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేశారున అనంతరం దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీకి బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ నెల 24,25,26వ తేదీల్లో ఫ్యామిలీతో కలిసి దీపావళి పండుగ జరుపుకోనున్నారు. అనంతరం 27వ తేదీన తెలంగాణలో రాహుల్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. 12 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర తెలంగాణలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. రోజుకు 25 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.

సాయంత్రం వేళ ప్రజలతో మమేకం అయ్యారు. అలాగే కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడనుననారు. నవంబర్ 1,2న రాహుల్ హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ పరిధిలో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. 1వ తేదీన నెక్లెస్ రోడ్ లో భారీ బహిరంగసభ జరగనుంది. ఈ సభలో సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ కూడా పాల్గొననున్నారు. రాహుల్ పాదయాత్రలో సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. ఇక నవంబర్ 7న జుక్కల్ నియోజకవకర్గంలోని మద్నుర్ మండలం శాఖాపూర్ వద్ద రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ముగియనుంది. తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి రాహుల్ పాదయాత్ర అడుగుపెట్టనుంది.

తెలంగాణలో రాహుల్ పాదయాత్రను గ్రాడ్ సక్సెస్ చేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తోన్నారు. లక్ష మంది రోజు రాహుల్ పాదయాత్రలో పాల్గొనేలా ప్లాన్ చేశరాు. దీని కోసం భారీగా జనసమీకరణ చేయనున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలను తరలించనున్ నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర సక్ెస్ చేయడం ద్వారా తెలంగాణలో పార్టీ బలపుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -