Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారనుందా.. వచ్చే ఎన్నికల్లో జరగబోయేది ఇదేనా?

Telangana Elections 2023: ఈసారి రాబోయే తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతాయి అనిపిస్తుంది. తెలంగాణలో రాజకీయ జంపింగ్లు త్వర త్వరగా జరుగుతున్నాయి. ఏ పార్టీలో నాయకుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో అర్థం కావడం లేదు. శాసనసభ ఎన్నికలు నవంబర్ 30వ తారీఖున జరిగితే డిసెంబర్ మూడో తారీఖున ఫలితాలు వస్తాయి. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత గత రెండు సార్లు ఎలాంటి డోకా లేకుండా సునాయాసంగా గెలిచేసింది. కానీ నేడు పరిస్థితులు చూస్తే బీఆర్ఎస్ కి చాలా క్లిష్టంగా కనిపిస్తున్నాయి.

నిజం చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ కి సరియైన ప్రత్యర్థి వర్గం లేదు. కానీ ఈసారి అనుకోని విధంగా కాంగ్రెస్ బలాన్ని పుంజుకొని టీఆర్ఎస్ కి గట్టి పోటీని ఇస్తుంది. కొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుంది అని సూచిస్తున్నాయి, మరికొన్ని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలోకి సరి సమానంగా అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాయి, మరికొన్ని సర్వేలు మాత్రం బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అధికారంలోకి వచ్చి తీరుతుంది అని కరాకండీగా చెప్తున్నాయి.

తెలంగాణ ప్రజలు కూడా ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నాట్లుగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని అన్ని పార్టీల నేతలు గమనించినట్లుగా ఉన్నారు అందుకే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

కేసీఆర్ మాత్రం ఈసారి 119 సీట్లకి కనీసం 90 నుంచి 100 సీట్లు తప్పక గెలుచుకుంటామని నమ్మకం మీద ఉన్నారు. అయితే కిందటిసారి లోక్సభ ఎన్నికల అప్పుడు కూడా ఆయన అంచనాలు పూర్తిగా తప్పాయి. రాజకీయ అంచనాల ప్రకారం ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఎదురీత తప్పకపోవచ్చు. ఒకవేళ ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే క్లిష్ట పరిస్థితులని ఎదురుకోవలసిన సమస్య వస్తుంది. అదే కాంగ్రెస్ ఓడిపోతే ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నీళ్లు వదులుకోవాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: చంద్రబాబు స్టామినాకు ఫిదా అవ్వాల్సిందే.. ఏడు పదుల వయస్సులో చెలరేగిపోతున్నారుగా!

Nara Chandrababu Naidu:  ఏపీలో ఎన్నికలవేళ పార్టీ ప్రచారాల జోరు ఊపందుకున్న నేపథ్యంలో అందరి దృష్టి చంద్రబాబు నాయుడు మీద పడటం గమనార్హం. చంద్రబాబు నాయుడు లో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.....
- Advertisement -
- Advertisement -