Temple: అసలు గుడిలో భక్తులకు ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా?

Temple: తిరుపతి,షిర్డీ, శ్రీరంగం ఇలా ఏ దేవుడి గుడి గురించి మాట్లాడిన దేవుడితో పాటు అందరికీ గుర్తుకు వచ్చేది ప్రసాదం. ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క రకమైన ప్రసాదానికి పెట్టింది పేరు.మామూలుగా గుడికి వెళ్తే ఎవరికైనా ప్రసాదం పెడతారు. రుచిగా ఉండే వేడివేడి ప్రసాదాన్ని ఇష్టంగా తింటానే తప్ప అది ఎందుకు పెడతారు అని ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా? రోజు మనకు పెట్టే ప్రసాదం వెనక ఒక గొప్ప ఉద్దేశం దాగి ఉంది. ప్రసాద వితరణ చేయడం వెనుక అందరూ ఆరోగ్యకరమైన భోజనం తినాలి అనే ముఖ్య ఉద్దేశం దాగి ఉంది.

 

పూర్వం రోజుల్లో అందరి దగ్గర సరియైన ఆహార పదార్థాలు ఉండేవి కాదు. మీరు తినే పౌష్టికాహారాన్ని అందరికీ పంచండి అని చెప్తే జనాలు వింటారా? వినరు. కాబట్టి ప్రసాదం చేసి పంచితే భగవంతుడు ఆనందిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని పెద్దలు చెబుతూ వచ్చారు. భగవంతుని అనుగ్రహం పొందడం కోసం ఎంత డబ్బైనా వెచ్చించి ప్రసాదాలు మరియు అన్నదానాలు చేయడానికి ఎవరు సంకోచించారు. కాబట్టి అనాదిగా గుడిలో ప్రసాద వితరణ అనేది ఒక ఆచారంగా మారింది.

 

ప్రతిరోజు దేవుడికి నివేదన పెట్టి ఆ ఆహారాన్ని ప్రసాదంగా ఎంతోమంది నిర్భాగ్యులకు అందించడం ప్రతి గుడిలో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్న ఆచారం. మనం ప్రసాదమే కదా అనుకుంటా కానీ దాన్ని ఎంతో పవిత్రమైన భోజనంగా తిని గడిపే జనాలు మన చుట్టూ ఉన్నారు. అందుకే వీలైన సందర్భాలలో నలుగురికి అన్నదానం చేయడం ఎంతో శ్రేయస్కరం.

 

పైగా మనం ప్రసాదంగా నివేదించే కట్టె పొంగలి, బెల్లపు పొంగలి ,పులిహోర, సెనగలు ,వడలు వంటి వాటిల్లో ఐరన్ ,కార్బోహైడ్రేట్స్ ,కాల్షియం పీచు పదార్థాలు, పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రసాదం పెట్టి పంచడం ద్వారా మనం ఎంతోమందికి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాము. గుడిలో పెట్టే ప్రసాదం ద్వారా ఊరిలోని జనం అందరిని ఆరోగ్యంగా ఉంచాలి అని ఆలోచనతో మన పెద్దలు దీనిని ఆచారంగా మార్చారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -