Hyderabad: హైదరాబాద్ లో బీభస్తం సృష్టిస్తున్న ఉగ్రవాదులు!

Hyderabad: ఉగ్రవాదుల అరెస్టుతో హైదరాబాదు ఉలిక్కిపడింది. గత సంవత్సరం దసరా సందర్భంగా బీభత్సం సృష్టించటానికి కుట్రపన్నిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేయటం మరువకముందే తాజాగా మరొక భారీ కుట్ర బయటపడింది. మధ్యప్రదేశ్ ఏ టి ఎస్ పోలీసులు హిజ్బ్ ఉత్ తాహిర్ సంస్థతో సంబంధాలు ఉన్న ఐదుగురిని అరెస్టు చేశారు.

కాగా ఒకడు పరారీలో ఉన్నాడు. జగద్గిరిగుట్ట లోని మగ్దుమ్ నగర్ లో ఒకరు, గోల్కొండ పరిధిలోని బడా బజార్, హఫీజ్ బాబా నగర్ జవహర్ నగర్ లోని బాలాజీనగర్ లో నిందితులు నివాసం ఉంటున్నారు. గత కొన్ని నీళ్లు గా రహస్యంగా నగరంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఉగ్రవాదం వైపు ఆకర్షించడం విధ్వంసం లక్ష్యంగా వీరంతా నగరంలో మఖం వేసినట్లు పోలీసులు గుర్తించారు.

 

చెన్నై, బెంగళూరు తదితర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాదులోనే కొనసాగిస్తున్నారు. లష్కరే తోయిబా, హిస్ బుల్ ముజాహిదీన్ సాయిలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో గత 20 ఏళ్ల నుంచి తెలుగు చూస్తూనే ఉన్నాయి. వీటి వెనక పాకిస్తాన్ మెగా సంస్థలను ఉన్నట్లు ఇప్పటికే చాలాసార్లు రుజువయింది.

 

దీని ప్రోత్సాహంతో చేసిన కుట్రలు విధ్వంశాలు హైదరాబాదులో భారీ నష్టాలనే మిగిల్చాయి. నిందితుల్లో చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే స్థానికులకు ఎలాంటి అనుమానం రాకుండా వాళ్లలో కలిసిపోయి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తిస్తున్నారు. కేంద్ర నిగా వర్గాల సమాచారం తో ఈ భారీ కుట్రని చేదించగలరు పోలీసులు.

 

కొత్త వాళ్ళని త్వరగా నమ్మొద్దని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకి సమాచారం ఇవ్వాలని స్థానికులకి అవగాహన కల్పించారు పోలీసులు. భద్రతా దళాల అదుపులో ఉన్న ఉగ్రవాదుల నుంచి మొబైల్ ఫోన్లు లాప్టాప్ లు మారనాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులందరినీ అరెస్టు చేశామని చెప్పలేము. ఇంకా చాలామంది జనజీవన స్రవంతి లోనే ఉండి ఉంటారు అంటూ స్థానికులని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -