Thaman: తమన్ మాకేంటి ఈ కాపీ గోల.. తమన్ ను ఆడుకుంటున్న నెటిజన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలను చేతిలో పెట్టుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఈయన సంగీతంలో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన సంగీత సారథ్యంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ విడుదల చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది.

ఇకపోతే ఈ టీజర్ విడుదల చేసిన కొన్ని క్షణాలకే పెద్ద ఎత్తున ఈ టీజర్ పై నేటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ టీజర్ లో మెగాస్టార్ లుక్ ఏమాత్రం బాగలేదంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం సల్మాన్ ఖాన్ ను డ్రైవర్ గా చూపించడం గురించి కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో సత్యదేవ్ నయనతార లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి నేటిజన్ లు పెద్ద ఎత్తున మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వరుణ్ తేజ్ నటించిన గని టైటిల్ సాంగ్ మ్యూజిక్ లా ఉందని, గని సినిమా మ్యూజిక్ కి కాపీ కొట్టి బిజిఎంగా మార్చాలంటూ పెద్ద ఎత్తున ఈ టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై నెటిజన్లు తమన్ ను భారీగా ట్రోల్ చేస్తున్నారు.

ఇలా తమన్ మొదటిసారి కాకుండా ఇదివరకు పలు సినిమాలకు కూడా ఇలాంటి కాపీ ట్యూన్ ఇచ్చి అడ్డంగా బుక్ అయిపోయారు.ఈ క్రమంలోనే తమన్ మాకేంటి కాపీల గోల ఒక్కసారి అయినా ఒరిజినల్ మ్యూజిక్ ఇవ్వచ్చుగా అంటూ పెద్ద ఎత్తున అతనిని ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై తమన్ ఇప్పటివరకు ఏ విధంగాను స్పందించలేదు.మరి ఈ విషయాన్ని గుర్తించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేంజ్ చేస్తారా లేదంటే యదావిధిగా పెడతారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -