Actress: సీక్రెట్ గా పెళ్లిపీటలెక్కిన ఆ నటి..భర్త ఎవరంటే

Actress: ఈ మధ్యకాలంలో నటీనటులు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం ఆనవాయతీగా మారిందనే చెప్పాలి. తాాజాగా నటి దేవలీనా భట్టాచార్జి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. బుల్లితెర నటిగా ఈమె అందరికీ సుపరిచితమే. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఈమె కోడలా కొడలా కొడుకు పెళ్లామా అనే సీరియల్ లో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు ఈమె మరింత చేరువయ్యిందనే చెప్పాలి.

 

తాజాగా దేవలీనా భట్టాచార్జి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈమె రహస్యంగా పెళ్లి చేసుకుందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈమె తన ప్రియుడిని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం.

 

లోనావాలో దేవలీనా భట్టాఛార్జి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇరువురు కుటుంబీకులు, బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకకు దేవలీనా ఫ్రెండ్స్ అయిన విశాల్ సింగ్, రష్మీ సింగ్, భావిని పురోహిత్ దంపతులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం దేవలీనా భట్టాచార్జి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ట్విటర్‌లో కూడా దేవలీనాకీ షాదీ #DevoleenaKiShaadi అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్ లో ఉంది.

 

సోషల్ మీడియాలో విశాల్ సింగ్ తో దేవలీనా ఫోటోలు కనిపించడంతో అందరూ వీరిద్దరికీ పెళ్లి జరిగిందని అనుకుంటున్నారు. అంతేకాదు దేవలీనా కూడా తన హల్ది, మెహందీ, పెళ్లి ఫోటోలు పెట్టిందే తప్పా తన భర్త ఫోటోలు మాత్రం పెట్టలేదు. అతడి ముఖాన్ని చూపించకపోవడం వల్ల నెటిజన్లు పొరబడుతున్నారు. అయితే ఈ నటి జిమ్ ట్రైనర్ అయిన షాన్వద్ షైఖ్‌ను పెళ్లాడినట్లు తెలుస్తోంది. ఆ సస్పెన్స్ కు తెరతీస్తూ ఆమె తన భర్త ఫోటోను విడిగా షేర్ చేసింది. నా భర్త మరెవరో కాదు ఫేమస్ జిమ్ ట్రైనర్ షోనూనే అంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -