Rajinikanth: రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నటి.. రజినీకాంత్ భార్యగా?

Rajinikanth: రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం లాల్‌సలాం. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటిస్తున్నారు. అలాగే రజనీకాంత్‌ ఈ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో రజనీకాంత్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్‌ మొయ్దీన్‌ భాయ్‌ అనే ముస్లిం పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నటి జీవిత చాలాకాలం తర్వాత తమిళం లోకి రీఎంట్రీ ఇస్తోంది.

 

ఈ సినిమాలో నటి జీవిత రజనీకాంత్‌ చెల్లెలిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌ది అతిథి పాత్ర కావడంతో ఆయనకు జోడీ ఉంటుందా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటూ వచ్చింది. దీనికి సంబంధించిన హాట్‌ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. 1980 ప్రాంతంలో యువ కథానాయకిగా వెలిగిన నిరోషా దివంగత ప్రఖ్యాత నటుడు ఎమ్మార్‌ రాధా కూతురు, నటి రాధిక సోదరి అయిన ఈమె అప్పట్లో నటుడు కమల్‌ హాసన్‌, విజయ్‌కాంత్‌, ప్రభు, కార్తీక్‌ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. కేవలం తమిళ సినిమాలలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి జీవిత.

చాలా కాలం తర్వాత ఆమె లాల్‌ సలాం చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు అందులో రజనీకాంత్‌కు భార్యగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నారు ఐశ్వర్య రజనీకాంత్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -