Mint Tea: పుదీనా టీ తాగితే ఈ సమస్యలు మటుమాయం!

Mint Tea:  చాలా మంది ఉదయం లేవగానే టీ తాగనిదే బయటకు వెళ్లారు. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు.. ఇద్దరు స్నేహితులు కలిసినప్పుడు మొదటగా వచ్చే మాట టీ తాగుదమా అనే వస్తోంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ప్రముఖులు సైతం టీ విందు పేరుతో సమావేశాలను నిర్వహిస్తారంటే టీకున్న పవర్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మనస్సు డల్‌గా ఉన్నప్పుడు ఆఫీస్‌వర్క్‌లో ఒత్తిడి కలిగినప్పుడు ఓ కప్పు టీ తాగితే అప్పుడే వచ్చే ఉత్సాహం ఓ లెవవ్‌లో ఉంటుందని టీ ప్రియులు చెబుతుంటారు. ప్రస్తుత కాలంలో టీను కూడా వివిర రకాలుగా తయారు చేస్తున్నారు. ఇరానీ టీ, మసాల టీ, మస్కటీ, మలాయి టీ ఇలా ఎన్నెన్నో పేర్లు పెట్టి పిలుస్తున్నారు.

అయితే పుదీనా ఆకులతో తయారు చేసిన టీని ప్రతిరోజూ తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పుదీనా ఆకులతో కాచిన కషాయంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్య తగ్గుతుంది. పుదీనాలో యాంటీ ఇన్‌ప్లేమెటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి అలర్జీని దూరం చేస్తాయి. వర్షాకాలం, శీతాకాలంలో పుదీనా ఆకుల నూనె వేసి ఆవిరి పట్టినట్లయితే జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. వంటల్లో తరచూ పుదీనాని చేర్చుకోవడం వల్ల నోటిలోని హానికర బాక్టీరియాలను నశింపజేయవచ్చు.

పుదీనా ఉండే విటమిన్‌ సీ,డీ,ఈ,బీలు క్యాల్షియం, పాస్పరస్‌ మూలకాల కారణంగా రోగనిరోధక శక్తి అమాంతంగా పెరిగిపోతుంది. తద్వారా పలు రోగాలు దరి చేరవు. అంతేకాక శ్వాస సంబంధిత సమస్యలనుసైతం పుదీనా ఆకు దగ్గరికి రానివ్వదు. అందుకే పుదీనాను వంటకాలతో పాటు లెటెస్ట్‌గా టీలో కలిసి తాగుతున్నారు. దీన్ని చిన్నాపెద్ద తేడా లేకుండా తాగాలని ఇలా ప్రతి రోజూ తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు సలహాలు ఇస్తున్నారు .

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -