Hyderabad: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. ఆ నిర్ణయానికి అనాధలుగా మారిన చిన్నారలు?

Hyderabad: ఈ మధ్యకాలంలో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొద్దిరోజులకే విడాకులు తీసుకుని విడిపోవడం లేదంటే ఒకరినొకరు నిందించుకొని చంపుకోవడం లాంటివి చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు జంటలు పట్టుమని సంవత్సరం కూడా కలిసి ఉండక ముందే మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ప్రేమ జంట ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వారికి మూడేళ్ల లోపు ఉండే ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే జీవితం సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో వారి జీవితంలో ఊహించని విధంగా విషాదాలు నెలకొన్నాయి.. అసలేం జరిగిందంటే..

వెస్ట్‌ మారేడుపల్లి పికెట్‌ గాంధీకాలనీకి చెందిన దాసరి అఖిల్‌ 24 ఏళ్ళ యువకుడు మియాపూర్‌కు చెందిన మౌనిక అనే 24 ఏళ్ల యువతిని 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. రెండున్నరేళ్ల ప్రణవ్‌, ఏడాది వయస్సున్న హారిక. అయితే అనారోగ్యం కారణంగా గతనెల 23న మౌనిక చనిపోయింది. జీవితాంతం కలిసిమెలిసి ఉండాలని ఎన్నో ఆశలు పెట్టుకుని వివాహం చేసుకున్న భార్య ఇలా మధ్యలోనే మృతి చెందడంతో అఖిల్‌ మానసికంగా కుంగిపోయాడు. ఆ బాధ నుంచి తేరుకోలేకపోయాడు. దాంతో ఒక దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా శనివారం మధ్యాహ్నం భార్య 21వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో పూజ పనుల్లో కుటుంబ సభ్యులు నిమగ్నమయి ఉన్నారు.

 

పూజలో కూర్చునేందుకు అఖిల్‌ను రమ్మని పిలిచింది అతడి తల్లి. స్నానం చేసి 5 నిమిషాల్లో వస్తానని చెప్పి తన గదిలోకి వెళ్లిన అఖిల్‌ ఎంతకూ బయటకురాలేదు. స్నానం చేసి వస్తానని గదిలోకి వెళ్లిన కుమారుడు ఎంతకు బయటకు రాకపోవడంతో అఖిల్‌ తల్లికి అనుమానం వచ్చి బంధువుల సాయంతో తలుపులు తెరవగా భార్య చీరతో అఖిల్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే అతడిని కిందకు దించి గాంధీ ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కేవలం 21 రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు చనిపోవడంతో పాపం ఆ చిన్నారులిద్దరూ అనాధలయ్యారు. తల్లిదండ్రులు కానరాని లోకాలకు వెళ్లారని తెలియక వారి కోసం ఏడుస్తున్న చిన్నారులను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకుంటున్నారు. కాగా అఖిల్ మృతదేహం చూసిన అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -