Shekavath Saab: అదిరిపోయిన షెకావత్ సాబ్ ఫస్ట్ లుక్.. ఇక తగ్గేదేలే?

Shekavath Saab: పుష్ప 2.. ది రూల్ మూవీ నుంచి ఫహద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రం గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు మూవీ మేకర్స్ తాజాగా అప్డేట్స్ అందించారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పుష్ప2 గ్రాండ్గా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయకగా నటిస్తుంది.

మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పుష్ప ని సరైన ప్రతి నాయకుడు అనిపించుకున్నట్లుగా ఫస్ట్ పార్ట్ లో నటించాడు. ఇక సెకండ్ పార్ట్ లో అతని పాత్ర మరింత గంభీరంగా ఉండబోతుందని సుకుమార్ ఎప్పుడో చెప్పాడు. అయితే ఈరోజు ఫాహద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా యూనిట్ సభ్యులు ఆయన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ప్రతీకారం తీర్చుకునేందుకు వస్తున్నాడంటూ మేకర్స్ పేర్కొన్నారు.

 

పోలీస్ చొక్కా ధరించి సిగరెట్ తాగుతూ సన్ గ్లాసెస్ పెట్టుకొన్న ఫహద్ ఫాజిల్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొదటి భాగంలో ఇద్దరి మధ్య పోరు మొదలైంది. రెండవ భాగానికి వచ్చేటప్పటికి ప్రతీకారం తీర్చుకోవడానికే షెకావత్ సార్ తిరిగి వస్తున్నారు అని తెలిపారు మూవీ మేకర్స్. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. భన్వర్ సింగ్ షెకావత్ సాబ్.. ప్రతీకారంతో వస్తున్నారు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

 

దీంతో నిన్నటిదాకా అప్డేట్ లేదా పుష్ప అంటూ అడిగిన అభిమానులు ఇప్పుడు పార్టీ లేదా షెకావత్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో పుష్ప 2 ది రూల్ హ్యాష్ టాక్ ట్రెండింగ్ లోకి వచ్చింది. పుష్ప టూ లో షెకావత్ పాత్రకి నిడివి ఎక్కువగా ఉంటుందని హీరోకి ఈ పాత్రకి యాక్షన్ సీన్స్ ఉంటాయని పాహద్ ఫాజిల్ ఈమధ్యనే పాత్రికేయులకి చెప్పుకొచ్చాడు. మొత్తానికి తగ్గేదేలే అంటూ రచ్చ చేసిన పుష్ప సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్నారు పుష్ప వీరాభిమానులు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -