YS Jagan: ఆ అమ్మాయి స్పీచ్ కు కంటతడి పెట్టిన జగన్.. ఏం జరిగిందంటే?

YS Jagan: సీఎం జగన్ నవరత్నాలలో భాగంగా వసతి దీవెన విద్యా దీవెన అంటూ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా చాలామంది విద్యార్థులు లబ్ధి పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ఎందరో ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో దివ్య ఒకరు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే హోంమంత్రి తానేటి వనిత క్యాంప్ కార్యాలయం వద్ద నిర్వహించిన సభకు సీఎం జగన్ హాజరయ్యారు విద్యాధీవన పథకం కింద 9,95,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 703 కోట్ల రూపాయల నిధులను జమ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

దివ్య కూడా తన సంతోషాన్ని సభాముఖంగా తెలియజేసింది. వేదిక ఎక్కి మొదట హుషారుగా మాట్లాడిన దివ్య ఉన్నట్టుండి తన కుటుంబ నేపథ్యం చెబుతూ జగన్ ని కన్నీరు పెట్టించింది. తన తల్లిదండ్రులు ఇద్దరు వికలాంగులని తండ్రికి పక్షవాతం వలన ఎటూ కదలలేని పరిస్థితి. తల్లి మూగ చెవిటి సమస్యలతో బాధపడుతుందని వాళ్ళ ఇద్దరికీ మేం ఇద్దరం ఆడపిల్లలు అని చెప్పుకొచ్చింది దివ్య.

 

కుటుంబ పరిస్థితి ఇలా ఉన్న సమయంలో చదువు కొనసాగించగలనో లేదో, తనకు జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులకు అండగా నిలబడగలనో లేదో అని ఆందోళన పడేదాన్ని కానీ చెల్లెమ్మ.. నేనున్నాను అంటూ జగనన్న వచ్చి విద్యా దీవెన, వసతి దీవెన అంటూ నా కాలేజీ ఫీజు మొత్తం అన్నయ్య కట్టాడు అందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

 

మా తల్లిదండ్రులకి పెన్షన్ ఇప్పించి కొడుకుని నేనున్నాను అంటూ ధైర్యం చెప్పి మా ఇంటికి కొడుకు అయ్యాడు. తాను ఇవాళ ఇంత ఆనందంగా ఉండడానికి కారణం జగనన్న అంటూ తన కృతజ్ఞతలు తెలియజెప్పింది దివ్య. ఈ స్పీచ్ కి సభలో ఉన్న వారితో పాటు సీఎం జగన్ సైతం కన్నీరు పెట్టుకోవడం విశేషం. జగన్ ముందు ఎంత ధైర్యంగా మాట్లాడిన ఆ అమ్మాయి ధైర్యానికి ఫిదా అవుతున్నారు నెటిజెన్స్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -