Visakhapatnam: మూడో అంతస్తు నుంచి దూకిన వివాహిత.. ఎందుకంటే?

Visakhapatnam: దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కరువవుతోంది. రోజురోజుకీ మహిళలపై జరుగుతున్న ఆత్మహత్యలు హత్యలు, అత్యాచారాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నిత్యం పదుల సంఖ్యలో ఆడవారి మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో ఒక ప్రదేశంలో ఆడవారు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా అటువంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఒక వివాహిత మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆమె అలా చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ఏపీలోని విశాఖ తీరంలో చాలామంది స్త్రీలు వచ్చి అక్కడ ఆడుతూ పాడుతూ డాన్సులు చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. అలా స్వాతి అనే ఒక వివాహేత కూడా బాగా ఎంజాయ్ చేసింది. స్వాతి కులాంతర వివాహాన్ని చేసుకుంది. అయినప్పటికీ ఆమె భర్తతో సంతోషంగా జీవించేది. స్వాతి సంసారాన్ని చూసి చాలామంది అసూయపడేవారు. ఎంతో సజావుగా సంతోషంగా సాగుతున్న స్వాతి కాపురంలో ఊహించని విధంగా కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా భార్య భర్తలు ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది.

దాంతో తీవ్ర మనస్తవం చెందిన స్వాతి నిన్న అనగా బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఉదయం 10 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంది. మూడవ అంతస్తు నుంచి ఆత్మహత్య చేసుకోగా ఆమె తలకు గాయం అవ్వడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కుటుంబ సభ్యులు సమాచారంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. అయితే స్వాతి క్షణికావేషంలో తీసుకున్న నిర్ణయం తన బిడ్డను తల్లి లేని అనాధను చేసింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -