Bheemili: నమ్మించి పొదల్లోకి తీసుకెళ్లి ఆపై చివరికి అలా?

Bheemili: ఈ మధ్యకాలంలో మనుషులు అవసరాల కోసం ఎంతటి దారుణానికైనా ఒడి గడుతున్నారు. డబ్బులు ఇస్తే ఎదుటి వ్యక్తిని చంపడానికి కూడా నిలపడడం లేదు. ఇంకొంతమంది పరిచయాలను వారికి అనుగుణంగా మార్చుకోని స్వార్థంగా ఆలోచిస్తూ మనుషులను బలి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్నేహితులను నమ్మడం అన్నది కూడా ఒక సాహసమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎక్కువగా హత్యలు స్నేహితుల ద్వారానే చోటు చేసుకుంటున్నాయి. చిన్న వాటికే దారుణంగా ఎదుటి వ్యక్తులను చంపి చంపేస్తున్నారు.

తాజాగా ఒక యువతి కూడా అలాగే ఒక యువకుడిని నమ్మి చివరికి తన ప్రాణాలనే పోగొట్టుకుంది. ఈ దారుణమైన ఘటన విశాఖపట్నం జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. మహిళ కనిపించడం లేదంటూ ఈ నెల 2న భీమిలీ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పటి నుండి ఆమె కోసం వెతుకుతున్నారు. అయితే తాజాగా ఆమె ఒక పొదల్లో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. తప్పిపోయిన మహిళగా గుర్తించారు.

 

ఆటో డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాథమిక విచారణలో ఆటో డ్రైవర్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారణైంది. మహిళతో ఆటో డ్రైవర్‌ రాజుకు గతంలో పరిచయం ఉండగా అతడితో వెళ్లిన తర్వాత హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. బంగారం కోసం ఆమెను చంపినట్లు పేర్కొన్నారు. ఆ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు ఆటో డ్రైవర్ రాజుని అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -