Visakhapatnam: శ్వేత మృతి కేసులో అలా జరిగిందా.. అందుకే చనిపోయిందా?

Visakhapatnam: విశాఖపట్నం ఆర్కే బీచ్ లో అనుమానాస్పద స్థితిలో కనిపించిన యువతి మృతదేహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇసుకలో కూరుకుపోయి ముఖం మాత్రమే బయటికి ఉన్న ఒక స్త్రీ శవాన్ని మార్నింగ్ వాకర్స్ గుర్తించి పోలీసులకి సమాచారం అందించారు. బాడీని చూసిన పోలీసులు విశాఖపట్నం కు దగ్గర్లో ఉన్న పెదగంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు.

అప్పటికే ఆమె మీద మిస్సింగ్ కేసు ఉండడం గమనార్హం. శ్వేత ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అది హత్య? ఆత్మహత్య? అని తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లిన శ్వేత రాత్రి అయిన తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు.

 

ఆ కేసు దర్యాప్తు ఉండగానే శ్వేత బీచ్ లో శవమై తేలింది. యువతి అయిదు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలియజేశారు. యువతి ఇంట్లోంచి బయటికి వెళ్లే ముందు భర్తతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఇప్పుడు ఆ సంభాషణ కేసులో కీలక ఆధారాలుగా మారనున్నాయి. అందుకు కారణం శ్వేత దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండడం.

 

ఆమె భర్త శ్వేత కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అతని కుటుంబ సభ్యులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడంటూ తరచుగా భర్తతో గొడవపడేదని సమాచారం. శ్వేత చనిపోయిన తర్వాత శవం సముద్రం ఒడ్డుకి కొట్టుకొచ్చిందా? లేకపోతే ఎవరైనా దుండగులు ఆమెని చంపి ఇసుకలో పాతేశారా అనే విషయాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వంటి మీద గాయాలను బట్టి హత్యగా అనుమానిస్తున్నారు పోలీసులు.

 

ఆత్మహత్య చేసుకుని ఉంటే ఒంటి మీద బట్టలు లేకుండా ఎందుకు చేసుకుంటుంది అనేది వారి యొక్క అభిప్రాయం. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. శ్వేత ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి ముందు భర్తతో ఫోన్లో మాట్లాడిందని తెలుసుకున్న పోలీసులు ఆ ఫోన్ సంభాషణ ఏంటనేది తెలిస్తే కేసు ఒక కొలిక్కి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -