Amit Shah: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. సీఎం జగన్ పరువు పోయేలా?

Amit Shah: విశాఖలోని రైల్వే గ్రౌండ్ లో బిజెపి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో జగన్ పాలనలో అవినీతి కుంభకోణాలు తప్ప ఏమీ జరగలేదంటూ మండిపడ్డారు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు భారత్ మాతాకీ జై చెప్పి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

 

అటు సింహాచలం అప్పన్నకి ఇటు కనకమహాలక్ష్మి అమ్మవారికి మరి నమస్కారాలు తెలియజేసుకున్నారు. తెన్నేటి విశ్వనాథం పీవీ జి రాజు అల్లూరి సీతారామరాజు ని స్మరించుకుందాం అని చెప్పారు. అనంతరం జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడో స్థానంలో ఉందని ఎందుకు గాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు అమిత్ షా.

ప్రధాని మోదీ ఉచితంగా ఇచ్చే బియ్యం పైన జగన్ ఫోటోలా అంటూ ప్రశ్నించారు. రైతులకు కేంద్రం ఇస్తున్న డబ్బుని తామే ఇస్తున్నట్లుగా జగన్ ప్రచారం చేసుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. అలా అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏమయ్యాయో చెప్పాలంటూ నిలదీశారు. జగన్ పాలనలో విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిందని తన ఆవేదన వ్యక్తం చేశారు అమిత్ షా.

 

సీఎం జగన్ పరువు పోయేలా ఆయన చేసిన అవినీతిని బయటపెట్టారు అమిత్ షా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పదేళ్లలో ఐదు లక్షల కోట్లు ఇచ్చామన్నారు అమిత్ షా. అన్ని లక్షల అభివృద్ధి ఈ రాష్ట్రంలో కనిపిస్తుందా అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రైతు భరోసా పేరుతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

 

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లను కూడా తమ పథకం గా వైసిపి చెప్పుకుంటుందని విమర్శించారు అమిత్ షా. పరిపాలన అనేది మోడీని చూసి నేర్చుకోవాలి. దయాది పాక్ దేశం తోక జాడించి మన సైన్యంపై దాడులు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ తో సమాధానం చెప్పిందని గుర్తు చేశారు అమిత్ షా.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -