Visakha: విశాఖకు రైల్వే జోన్ రాకపోవడానికి జగన్ రెడ్డే కారణమా?

Visakha: ఏపీకి ప్రత్యేకహోదా రాలేదంటే ఆ పాపం నీదంటే నీదని.. ఒక పార్టీపై మరొక పార్టీ నిందలు వేసుకుంటున్నాయి. పద్దతి పాడు లేకుండా రాష్ట్ర విభజన జరగడంలో.. ఏపీకి ప్రత్యేకహోదా రాకపోవడంలో అన్ని పార్టీల పాపం కొద్దొగొప్పో ఉంది. కొచ్చెం ఎక్కువ తక్కువ కావొచ్చు కానీ.. ఆ పాపాన్ని అన్ని పార్టీలూ మూటగట్టుకున్నాయి. అయితే, చేతికొచ్చిన విశాఖ రైల్వేజోన్ ఎందుకు సాధ్యం కావడం లేదు? ఏపీలో జోరుగా జరుగుతున్న చర్చ ఇదే.

 

ఐదేళ్ల క్రితం అంటే సరిగ్గా ఎన్నికలకు రెండు లేదా మూడు నెలల ముందు కేంద్రం ఏపీకి రైల్వే జోన్ ప్రకటించింది. అప్పటికే బీజేపీ, టీడీపీ దోస్తీ కట్ అయిపోయింది. వాల్తేర్ డివిజన్ లేకుండా రైల్వే జోన్ తో ఏపీకి ఉపయోగం లేదని అంటూనే.. టీడీపీ జోన్ ప్రకటనను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసింది. ఇక, బీజేపీకి ఏపీపై దృషి ఉంది కనుకే రైల్వే జోన్ ప్రకటించిందని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం చెప్పుకొచ్చింది. విభజన హామీలపై రాజీలేని పోరాటం చేశాం కనుక రైల్వే జోన్ ప్రకటన సాధ్యమైందని వైసీపీ కూడా ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ ప్రకటనలతోనే ఏపీలో 2019 ఎన్నికలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత విశాఖ రైల్వే జోన్ ఊసే లేదు.

 

వైసీపీ గెలిచిన వెంటనే ఢిల్లీ వెళ్లిన జగన్.. ప్రత్యేక హోదా విషయంలో ఎలాగూ చేతులెత్తేశారు. బీజేపీ క్లియర్ మెజారిటీ ఉంది కనుక.. మనం ఏం చేయలేం. హోదా విషయంలో బ్రతిమాలడమే తప్పా.. చేసేదేమీ లేదని హోదా కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లేశారు. కానీ, అప్పటికే ప్రకటించిన రైల్వే జోన్ ఊసెత్తలేదు. ఆ తర్వాత కూడా ఎక్కడా మాట్లాడలేదు. అసలు జగన్ వైఖరి చూస్తే విశాఖకు రైల్వే జోన్ రావడం ఇష్టం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. రైల్వే జోన్ ఏర్పాటకు 53 ఎకరాల ల్యాండ్ కావాలని కేంద్రం కోరింది. కానీ, వైసీపీ ప్రభుత్వం భూ సేకరణ దిశగా అడుగులు వేయలేదు.

గత ఐదేళ్లలో విశాఖలో భారీ భూకుంభకోణ ఆరోపణలు వచ్చాయి. వేల ఎకరాల భూదందా జరిగిందని వైసీపీలో కీలక నేతలవైపే అందరూ చూశారు. చివరికి రామానాయుడు స్టూడియోను కూడా కబ్జా చేశారు. ఈ ఆరోపణలను వైసీపీ నేతలు కూడా బలంగా తిప్పి కొట్టలేదు. అంటే, ఈ ఆరోపణల్లో ఎంతోకొంత నిజం లేదని చెప్పలేం. విశాఖలో వేల ఎకరాల భూములపై కన్నేసిన వైసీపీ నేతలు.. రైల్వేజోన్‌ కోసం మాత్రం 53 ఎకరాల భూమి కేటాయించలేదు. ఆ భూమి కేటాయించకపోవడం వలనే జోన్ కల సాకారం కాలేదని బీజేపీ ఆరోపణలు చేస్తోంది.

 

తొలుత మూడు రాజధానులు అని చెప్పి తర్వాత.. విశాఖయే అసలైన రాజధాని అని స్వరం మార్చిన వైసీపీ నేతలకు ఉత్తరాంధ్రపై నిజంగా చిత్తశుద్ది ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానులను అడ్డుకున్న టీడీపీ నేతలపై ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చ గొట్టే వ్యాఖ్యలను వైసీపీ నేతలు చేసుకొని వచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రతిపక్షానికి ఇష్టం లేదని సెంటిమెంట్‌తో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మరి నిజంగా వైసీపీకి అంత చిత్తశుద్ధి ఉంటే రైల్వేజోన్ కోసం ఎందుకు 53 ఎకరాలు కేటాయించలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -