visakhapatnam: శ్వేత భర్త భార్యను టార్చర్ చేశారా.. ఏం చెప్పారంటే?

visakhapatnam: విశాఖ బీచ్ లో శ్వేత అనే గర్భిణి మహిళా అనుమానాస్పద రీతిలో నగ్నంగా మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి కనిపించకుండా పోయిన శ్వేత.. ఉన్నట్టుండి బీచ్ లో శవమై కనిపించడంతో మృతురాలి కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె చనిపోయే ముందు సూసైడ్ లెటర్ రాసి మరి చనిపోవడం పలు అనుమానాలను కలిగిస్తుంది. అయితే ఇంట్లో గొడవల కారణంగానే శ్వేత మరణించిందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి శ్వేత విషయంలో తన భర్త మణికంఠ ఏం చెప్పారు అనే విషయానికి వస్తే….

శ్వేతా మణికంఠల వివాహం గత ఏడాది ఎంతో ఘనంగా జరిగింది అయితే మణికంఠ ఇదివరకు వర్క్ ఫ్రమ్ హోం చేసేవారు. ఆఫీసుకు రమ్మని చెప్పడంతో మణికంఠ గత పది రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు. ఇక పెళ్లయిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో చిన్న చిన్న గొడవలు ఉండడం సర్వసాధారణమని అలాంటి గొడవలే మా మధ్య కూడా ఉన్నాయని మణికంఠ వెల్లడించారు. ఇక శ్వేతకు గొడవల విషయంలో తను సర్ది చెబుతూ వచ్చే వాడినని తెలిపారు.

 

ఇక తాను మా ఇంట్లో వారితో గొడవ పడి రెండుసార్లు వారి పుట్టింటికి వెళ్లి తిరిగి వచ్చింది. ఇక మంగళవారం కూడా నాతో ఫోన్లో మాట్లాడింది ఇద్దరి మధ్య చిన్న గొడవ చోటు చేసుకోవడంతో తాను ఫోన్ కట్ చేసిందని తిరిగి చూస్తే ఇంట్లో కనిపించడం లేదని వార్త నాకు తెలిసింది. అయితే మా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా తనని ఏమీ అనేవారు కాదు. తాను నాతోపాటు హైదరాబాద్ రావాలని కోరగా మరి కొద్ది రోజులు ఆగితే తీసుకెళ్తానని చెప్పాను.

 

ప్రస్తుతం శ్వేత ఐదవ నెల ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ సమయంలో అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకు ఏదో ఒకచోట ఉండమని చెప్పాను. అది మా ఇంట్లో అయిన పరవాలేదు తన తల్లి గారి ఇంటిలో అయినా పర్వాలేదని చెప్పాను. డెలివరీ అయిన తర్వాత తనని హైదరాబాద్ తీసుకెళ్తానని చెప్పానని మణికంఠ వెల్లడించారు.కానీ తాను ఎందుకు ఇలాంటి పని చేసిందో అర్థం కావడం లేదని మణికంఠ తెలిపారు. కనీసం తను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు తన కడుపులో ఐదు నెలల బేబీ ఉందన్న ఆలోచన కూడా తనకు రాలేదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా శ్వేత మరణం గురించి మణికంఠ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -