Vizag Constable Case: భర్తను చంపుతుంటే వీడియో తీసిన భార్య.. పెళ్లి చేసుకోవాలంటే గజగజా వణికేలా?

Vizag Constable Case: విశాఖపట్నం కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. కానిస్టేబుల్ రమేష్ ను తన భార్య శివాని చంపించింది అనే విషయం పోలీసులు గుర్తించారు. అయితే శివాని తన భర్త రమేష్ ను చంపుతున్న సమయంలో దగ్గరుండి వీడియో తీశారు. ఈ వీడియో పోలీసుల కంటే పడటంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. ఇలా భర్తను చంపుతుంటే దగ్గరుండి మరి వీడియో తీసిన భార్యగా శివాని గుర్తింపు పొందింది అని చెప్పాలి. శివాని తన భర్తను చంపించడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

రమేష్ శివానిల వివాహం జరిగి చాలా సంవత్సరాలయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే శివాని ఆటో డ్రైవర్ రామారావు అనే వ్యక్తికి చాలా దగ్గర అయింది వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందన్న విషయం రామారావుకి తెలియడంతో తన భార్యను గట్టిగా మందలించారు అయితే గతంలో కూడా ఈ వ్యవహారం గురించి పెద్దల మధ్య పంచాయతీ కూడా జరిగింది. అయితే శివాని మాత్రం ప్రియుడు మోజులో పడి తన భర్త మాటలను లెక్కచేయలేదు.

 

తన భర్త అనే వ్యక్తి అడ్డు లేకపోతే తనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని భావించిన శివాని తనని అడ్డు తొలగిస్తే తన ప్రియుడితో సెటిల్ అవ్వచ్చని ఆలోచించింది. ఈ ఆలోచన రావడమే ఆలస్యం నీలా అనే ఒక వ్యక్తిని కలిసి రెండు లక్షలకు తన భర్తను చంపేలా సుపారీ ఇచ్చింది. ప్లాన్ ప్రకారమే తన భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చిన శివాని తన భర్త గాఢ నిద్రలో ఉండగా నీలా అనే వ్యక్తి తన మొహం పై దిండు పెట్టి ఊపిరాడకుండా చంపేశారు. అయితే ఈ ఘటన మొత్తాన్ని శివాన్ని వీడియో తీయడం గమనార్హం.

 

ఇక తన భర్త మరణ విషయంలో తనకు ఏమి సంబంధం లేదన్నట్టు వ్యవహరించిన శివాని పై అనుమానం వచ్చిన పోలీసులు తన ఫోన్ తీసుకొని డేటా, వాట్సప్ చాట్ అన్ని ఎంక్వయిరీ చేయడంతో ఆమె తన భర్తను చంపించిందని వెలుగులోకి వచ్చింది అయితే పోలీసులకు తన భర్తను చంపుతున్న సమయంలో ఈమె వీడియో తీసిందన్న విషయాన్ని కూడా గుర్తించారు. ఇక ఈ వీడియో చూసినటువంటి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -