YCP MLA: ఆ పదం విషయంలో వెనక్కు తగ్గిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే?

YCP MLA: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గారు. ప్రొద్దుటూరులో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఎస్‌ఐ అలీబేగ్‌పై ఎమ్మెల్యే రాచమల్లు పరుష పదజాలంలో మండిపడ్డారు. సెబ్‌ కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లి కుర్చీల్లో కూర్చుని వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీకి కాదు ఎమ్మెల్యే బాబుకి చెప్పుకో అన్న పదాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అని అన్నారు. అయితే ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గుతూ క్షమాపణలు కూడా తెలిపారు. ఒక ప్రజాప్రతినిధిగా ఆ పదజాలాన్ని వినియోగించడం సరికాదని, ఈ పదం జిల్లాలో బూతు పదం కాదని, కానీ సాధారణ ప్రజలు వారి బాధను వెలిబుచ్చే సమయంలో ఈ పదాన్ని వాడతారని ఆయన అన్నారు.

 

ఆ పదాన్ని ప్రజాజీవితంలో బాధ్యతగా ఉన్న వ్యక్తిగా తాను ఉపయోగించరాదని, ఆ పదం అనకుండా ఉండాల్సింది. ఒకవేళ బాధపడి ఉంటే క్షమించండి అని తెలిపారు శివప్రసాద్ రెడ్డి. అలాగే ఒక వ్యక్తి కేవలం మూడు మద్యం సీసాలే కొనుగోలు చేయాలనే చట్టాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఉంది. విదేశీ, ఇతర రాష్ట్రాల మద్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో వినియోగించకుండా ఉండేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విక్రయించే మద్యం పాలసీకి ఈ చట్టంలో మార్పులు చేయాలని తాను ముఖ్యమంత్రికి లేఖ రాయడంతో పాటు స్వయంగా వెళ్లి లేఖను అందిస్తానని అన్నారు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి.

పోలీసులు, అధికారులను కించపరుస్తూ వ్యాఖ్యానించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో వైఎస్సార్‌‌సీపీ అరాచకపాలనకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరే నిదర్శనమన్నారు. ఎస్‌ఈబీ పోలీసులపై రాచమల్లు వ్యవహరించిన తీరును తామే ఖండిస్తున్నామని అన్నారు. అధికారులను నిలబెట్టి వారి కుర్చీలో కూర్చుని పరుషపదజాలంతో దూషించడం చూస్తుంటే అసలు రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా అనే అనుమానం ఉందని అన్నారు. ఎస్‌ఈబీ అధికారిని బెదిరించి, ఎస్పీని ధూషించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి, ఆయన అనుచరులను అరెస్టు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి డిమాండు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -