Pawan Kalyan: సీఎం జగన్ ను హీరోగా పెట్టి ఆ సినిమాను రీమేక్ చేయాలి!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం జగన్ ప్రతి బహిరంగ సభలో తాను పేదల కోసం పోరాడుతున్నాను అన్న విషయాన్ని ప్రతిసారి చెప్పుకోవడాన్ని పవన్ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశాడు. కాగా ఆ ట్వీట్ లో.. ఒక పోస్టర్ లో ఎడారిలో ఒక చిన్న పిల్లవాడు సూటుకేసు పట్టుకుని నడుచుకుంటూ పోతున్నట్లుగా ఉంది. అయితే ఇందులో చిన్న మార్పు చేయాలని.. జగన్ చేతిలో సూట్ కేసు కి బదులుగా సూట్ కేసు కంపెనీలు పెట్టాల్సి ఉంది అని అన్నారు.

తన అక్రమార్జనను మనలాండరింగ్ ద్వారా ఈ సూట్ కేసుల ద్వారా జగన్ పంపుతున్నారని తాను అమాయకుడిగా నటిస్తున్నరాని జగన్ పరోక్షంగా తెలిపారు. అవినీతి, అక్రమ సంపాదనతో అడ్డగోలుగా సంపాదించింది కాక అక్రమ నగదు చలామణి చేస్తూ అత్యంత ధనిక సీఎంగా ఉంటూ క్లాస్ వార్ అంటూ చెప్పుకోవడంపై పవన్ మండిపడ్డారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి లాంటి వ్యక్తి జగన్ కాదన్నారు. క్లాస్ వార్ అనే పదాన్ని పలికే అర్హత కూడా జగన్ కు లేదని మండిపడ్డారు. అక్రమ సంపాదన. హింసలతో తెచ్చి పెట్టుకున్న అధికారం నుంచి జగన్ నుంచి రాయలసీమ ఏదో ఒక రోజు విముక్తి పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు రాజస్థాన్ ఇసుక ఎడారులు అవసరం అని జగన్ మోహన్ రెడ్డితో చేయాలనుకుంటే అక్కడిదాకా అవసరం లేదన్నారు.

 

ఏపీ నదుల నుంచి తవ్వి తీసిన ఇసుక కలెక్షన్ పాయింట్లలో ఎడారి అంత ఉందని అక్కడే తీసుకోవచ్చన్నారు. అత్యంత విలాసవతమైన జీవితాన్ని ప్రజాధనంతో గడిపే జగన్ అందర్నీ పేదవాళ్లను చేసి తానే వాళ్లను బతికస్తున్నట్లుగా రేషన్ బియ్యం, పథకాల పేరుతో కొంత డబ్బు ఇచ్చి కవరింగ్ చేసుకుని క్లాస్ వార్ అంటున్నారు. పేదలను బతికిస్తున్నానని చెప్పుకుంటున్నారు. తాను లేనప్పుడు వాళ్లంతా బతకలేదనే భ్రమను ప్రజలకు కల్పిస్తున్నారు అంటూ ఆయన మండి పడ్డారు. జగన్ లేనప్పుడు వారంతా ఎంతో ఆత్మగౌరవంతో బతికేవారు. ఇప్పుడు జగన్ వారందరి ఉపాధిని దెబ్బకొట్టి ప్రభుత్వం మీద ఆధారపడేలా చేసి. తాను లేకపోతే పథకాలు రావని బెదిరిస్తున్నారు. దీనికి క్లాస్ వార్ అని పేరు పెట్టుకున్నారని జనం మండిపడుతున్నారు. దీన్నే పవన్ తన ట్వీట్‌లో వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -