Onion Prices: ఆ నెలలో భారీ పెరగనున్న ఉల్లి ధరలు.. కొనుగోలు చేయకపోతే ఇబ్బందేనా?

Onion Prices: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటి వరకు పచ్చిమిర్చి ధర మండిపోగా ఇప్పుడు టమోటా ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు టమోటాను కొనుగోలు చేయాలి అంటేనే వెనుకడుగు వేస్తున్నారు. ఇవి చాలా ఉన్నట్టు త్వరలోనే ఉల్లి ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఉల్లిపాయ ధరలు ఈనెల ఆఖరిలోపు పెరుగుతూ వెళ్లి సెప్టెంబర్ లోపు 1 కిలో 60 నుంచి 70 రూపాయల వరకు ఉండవచ్చని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్ తెలిపింది.

2020 కరోనా మహమ్మారి సమయంలో ఉల్లిపాయ ధరలు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్లీ ఆ స్థాయికి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సరఫరా-గిరాకీ అసమతౌల్యం ఆగస్టు చివరి నాటికి ప్రతిబింబించవచ్చు. రబీ ఉల్లి నిల్వ కాలం 1-2 నెలలు తగ్గాయి. ఈ నిల్వలు ఆగస్టు చివరికే తగ్గుముఖం పట్టనున్నాయి. దీంతో సెప్టెంబరు నాటికి సరఫరాలు తగ్గి ధరలు పెరగొచ్చ ని విశ్లేషించింది. అక్టోబరు నుంచి తగ్గుతాయ్‌: అక్టోబరు నుంచి ఖరీఫ్‌ పంట లభ్యత పెరిగితే, ఉల్లి ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని తన నివేదికలో పేర్కొంది. పండగల సీజనులో ధరల చలనాలు స్థిరంగా ఉండవచ్చని అంచనా వేసింది. తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఇతర కూరగాయల ధరలతో ఇబ్బంది పడ్డ వినియోగదార్లు ఈ ఏడాది జనవరి-మే నెలలో ఉల్లి ధరలు తగ్గడంతో ఊరట చెందారు.

 

ధర లేనందున, ఖరీఫ్‌ సీజనులో తక్కువ పంట సాగుచేశారు. దీంతో ఈ ఏడాది 8 శాతం మేర పంట విస్తీర్ణం తగ్గింది. ఖరీఫ్‌ ఉల్లి ఉత్పత్తి 5 శాతం తగ్గింది. వార్షిక ఉత్పత్తి 29 మిలియన్‌ టన్నులకు చేరవచ్చని అంచనా. అయిదేళ్ల సగటు కంటే ఇది 7 శాతం అధికమని ఆ నివేదిక తెలిపింది. తక్కువ ఖరీఫ్‌, రబీ దిగుబడి కనిపించినప్పటికీ ఈ ఏడాది ఉల్లి సరఫరా మరీ కటకటగా ఏమీ మారకపోవచ్చు. ఆగస్టు, సెప్టెంబరులో వర్షపాతాన్ని బట్టి ఉల్లి పంట ఆధారపడి ఉంటుందని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -