Pregnancy Test: కిట్ లేకుండా ప్రెగ్నన్సీ టెస్ట్ చేసుకోవాలంటే?

Pregnancy Test: తల్లి కాబోతున్న అనే మాట వినగానే మహిళల ఆనందానికి అంతు ఉండదు. ఆ సమయం కోసం ఎంతో ఎదురు చూస్తు తన కుటుంబంలో మరొకరు వస్తున్నారనే సంబరం పడుతుంటారు. ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీలతో వివిధ రకాలుగా గర్భధారణ పరీక్షలు చేసుకుంటారు. ఆస్పత్రులకెళ్లి స్కానింగ్‌ ద్వారా కొందరైతే.. ఇళ్ల వద్దనే ప్రెగ్నెన్సీ టెస్టింగ్‌ కిట్‌ ద్వారా చేసుకుంటారు. పూర్వ కాలం ఇలాంటి పరికరాలు లేకపోవడంతో వివిధ పద్ధతుల్లో గర్భధారణ పరీక్షలు చేసుకునే వారు. పూర్వకాలం ఎలాంటి ఆస్పత్రులు వైద్యులు ఉండేవారు కాదు. అయితే.. పూర్వం గర్భధారణ పరీక్షలు ఎలా చేసుకునే వారో తెలుసుకుందాం..16వ శతాబ్ధంలో  మహిళలు గర్భం దాల్చారో లేదోనని మూత్రం, లక్షణాల ద్వారా తెలుసుకునేవారంట. కొందరు మూత్రాన్ని  ద్రాక్షరసంలో వేసి అది పారదర్శకత కోల్పోతే గర్భిణి అయినట్లు నిర్ధారించేవారు. ఇంకొందరు మూత్రం రంగును బట్టి పుట్టబోయే బిడ్డ ఆడ లేక మగనో తేల్చేవారని చరిత్ర చెబుతోంది.

ఉల్లిపాయతో పరీక్ష..
గ్రీకులకాలంలో  మర్మావయాల వద్ద ఉల్లిపాయను ఉంచి తెల్లారి అదే ఉల్లిపాయను వాసన చూసేవారు. అప్పుడు ఉల్లిపాయ నుంచి వాసన వస్తే గర్భిణిగా తేల్చేవారు. లోపల పిండం కారణంగా  జీర్ణనాలం మొత్తం పూర్తిగా తెరుచుకుని ఓ గొట్టంలా పని చేస్తోందనే నమ్మకం.

కంటి రంగు ద్వారా..
మహిళ గర్భం దాల్చినట్లైతే వారికి రెండు నెలల లోపు వారి కళ్లలో జరిగే మార్పులను బట్టి ఫలితాలు చెప్పేవారు. ప్రతి నెల వారి కళ్లలో వచ్చే మార్పులు కంటి చూపును బట్టి కూడా గర్భధారణ గురించి చెప్పే పరిజ్ఞానం ఉండేది నాటి వైద్యులకు. అయితే.. నేటి వైద్యులు మాత్రం గర్భధారణ సమయంలో కళ్లలో వచ్చే మార్పు, కంటిచూపులో జరిగే పరిణామాలు సాధారణమే అంటున్నారు.

తాళం పద్ధతిలో..
15వ శతాబ్ధంలో పరీక్ష చేయాల్సిన మహిళ మూత్రం ఓ పాత్రలో వేసి అందులో తాళం వేసేవారంట. అది తెల్లారే వరకు తాళం అచ్చు ఆ పాత్రలో పడితే సదరు మహిళ గర్భదాల్చినట్లు నిర్ధారించి ఆమెకు సకల సౌకర్యాలు కల్పించి జాగ్రత్తలు పాటించేవారు. అయితే.. ఇది అర్థరహిత ఆలోచన అని కొందరు కొట్టి పడేస్తున్నారు.

చాడ్విక్‌ పేరుతో..
మర్మావయాల వద్ద అధిక రక్త ప్రసరణతో  రంగు పెరుగుతోందని 1836లో ఫ్రెంచి వైద్యుడైన జేమ్స్‌ చాడ్విక్‌ నిర్ధారించాడు. అయితే.. ఈ పరీక్ష మాత్రం ఎక్కువ సార్లు చేసేందుకు వీలు కాదని చెప్పాడు. నాటి కాలంలోని  సామాజిక పరిస్థితులు, మహిళల ఆరోగ్యం, తీసుకునే ఆహారాన్ని బట్టి పరీక్షల చేసి నిర్ధారించేవారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -