Navaratri: ఉల్లి, వెల్లుల్లి నవరాత్రుల్లోనే తినరాదంటారు.. ఎందుకో తెలుసా?

Navaratri: హిందూ ధర్మంలో వివిధ పండుగలు, పర్వదినాల కు విశిష్టస్థానం ఉంది. పూజాది కార్యక్రమాలకు తినే ఆహారానికి ప్రత్యేక నియమాలున్నాయి. ముఖ్యంగా నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించే భక్తులు సాత్వికాహారాన్నీ తినాలని సూచిస్తారు. ఉల్లిపాయలు, వెల్లుల్లిని తినే ఆహారంలో నిషేధించారు. నవరాత్రుల సమయంలో మాంసాన్ని నిషేధించి పండ్లు, కాయలు, కూరగాయలు, విత్తనాలు, పాలు, చిక్కుళ్ళు వంటి సాత్వికాహారాన్ని తినే ఆహారంలో చేర్చుకోవాలి.

ఆయుర్వేద నిపుణులు సాత్విక ఆహారం ఉత్తమమైంది నమ్ముతారు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఉపవాసం చేసే సమయంలో తినే ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అయితే సాత్వికాహారం తినడంతో జీవక్రియ పెరుగుతుంది. రోగనిరోధక పనితీరును మెరుగుపడడంతో పాటు, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచే అద్భుత సంజీవని సాత్వికాహారం.

ఆయుర్వేదం ఆహార పదార్థాలను మూడు విభిన్న గుణాలుగా వర్గీకరిస్తుంది. అవి సత్వ లేదా సాత్విక, రాజస లేదా తామస పదార్థాలుగా పేర్కొన్నారు. ఇక్కడ సాత్విక అంటే స్వచ్ఛమైన, సహజమైన, శక్తివంతం ఆహారం అని అర్థం. వెల్లుల్లిని రాజోగిని అని పిలుస్తారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి కోరికలు కలిగిస్తాయని హిందూ భక్తులు నమ్ముతారు. ఉల్లి పాయలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వారి ప్రవృత్తిపై పట్టు కోల్పోతుందని నమ్మకం.

నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజులు భక్తులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా స్వచ్చమైన, సరళమైన జీవితాన్ని అలవర్చుకోవాల్సిన సమయం. అయితే నవరాత్రి పండుగ రోజుల్లో రాజస, తామసిక ఆహారాలు తినడం వలన దృష్టి దైవం నుంచి మరలి ప్రాపంచిక విషయాలపై పడుతుందని నమ్మకం. అందుకు నవరాత్రులు ముగిసే వారకూ ఉల్లిపాయలు వెల్లులు తినకూడదంటారు.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -