AP: ఏపీ ప్రజలకు నరకం చూపిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ.. ఏమైందంటే?

AP: ఏ విషయంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ అనే మాటను వైసీపీ తీసుకొని వచ్చిందో కానీ.. అన్ని విషయాల్లోనూ ఏపీ రివర్స్ అవుతోంది. అభివృద్ధి, ఉద్యోగ కల్పన ఇలా ఒకటా రెండా? ప్రతీ దాంట్లోనూ సీన్ రివర్స్ అవుతోంది. ప్రస్తుతానికి అన్ని విషయాలను పక్కన పెడితే భూ రిజిస్ట్రేషన్లు ఏపీలో రివర్స్ గేర్ తీసుకున్నాయి. గేర్ మార్చాలని వైసీపీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు. ప్రభుత్వాలు ఏదైనా కొత్త విధానాన్ని తీసుకొని వస్తే.. పాత విధానం కంటే మెరుగ్గా ఉండాలి. ప్రజలకు సేవలు సులభతరంగా మరింత ప్రయోజనం కలిగేలా ఉండాలి. కానీ ఏపీలో రిజిస్ట్రేషన్ల విషయంలో అంతా రివర్స్ జరుగుతోంది.

 

ఏపీలో భూ రిజిస్ట్రేషన్లలో కొత్త విధానం వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు సేవలు నిలిచిపోతున్నాయి. సర్వర్లు మోరాయిస్తున్నాయి. గతవారం కూడా ఇదే సమస్య తలెత్తింది. ఇంతలోనే నిన్న, మొన్నక కూడా ఇదే సమస్య వచ్చిపడింది. దీంతో.. అటు భూ వ్యాపారం చేసేవాళ్లతో పాటు.. రిజిస్టర్ ఆఫీస్‌లో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. సోమవారం సర్వర్లు మొరాయించడంతో.. అధికారులు మంగళవారం రావాలని సూచించారు. అయితే, మంగళవారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో.. మంగళవారం అధికారులు కబుర్లు చెప్పి పంపారు. కొన్ని చోట్ల మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురైన భూ వ్యాపారులు అధికారులపై తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు.

రిజిస్ట్రేషన్ శాఖలో కార్డు ప్రైమ్ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చింది. మామూలుగా అయితే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లకు ఈకేవైసీ ఒక్కసారి చేస్తారు. కానీ, ఈ కొత్త విధానంలో రెండు సార్లు చేయాలి. ఈ పద్దతిలో భూమి అమ్మేవాడు, కొనేవాడు, ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండవు. వారి వేలిముద్రనే సంతకంగా పరిగణిస్తారు. ఈ విధానంలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కు ఎక్కువ టైం పడుతోంది. అందుకే.. ఎప్పటికప్పుడు సర్వర్ డౌన్ అవుతోంది.

 

గతంలో పని అంతా రిజిస్టార్ ఆఫీస్ దగ్గరే పూర్తి అయ్యేది. కానీ.. కొత్త విధానంలో దరఖాస్తుదారులే డాక్యుమెంట్లు రూపొందించుకోవాలి. లేకపోతే నెట్ సెంటర్‌కు వెళ్తే అక్కడ తెలిసిన వారి సాయంతో దరఖాస్తు చేసుకోవాలి. మొదట రిజిస్ట్రేషన్ కోసం అప్లయ్ చేయాలంటే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. అక్కడ మన భూమి రకం, భూ విస్తీర్ణం బట్టి ఏ ఫార్మేట్ ఉంటుందో తెలుసుకొని దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఆఫారం నింపి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి లింక్ చేయాలి. అప్పుడు సబ్ రిజిస్టార్ ఆ దరఖాస్తును పరిశీలించి ఏమైనా తప్పులు ఉంటే వాటిని సవరించాలని వెనక్కి పంపిస్తారు. వాటిని సవరించి పంపిస్తే.. అప్పుడు రిజిస్టార్ ఆఫీస్‌లో భూమి కొనుగోలు దారుడు, అమ్మకం దారుడు, సాక్షులు వేలి ముద్రలు వేస్తారు. ఇంత ప్రాసెస్ ఉండటం వలన సర్వర్ చాలా సార్లు మొరాయిస్తుంది. తప్పులను సవరించేటప్పుడే ఎక్కువగా మొరాయిస్తోంది. ఈ ప్రాసెస్ అంతా రిజిస్టార్ ఆఫీస్ లో పూర్తి చేసేలా ఉంటే ఇంత తలనొప్పి ఉండేది కాదు. కానీ, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం వలనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. దీంతో.. జగన్ సర్కార్ పై రివర్స్ గేర్ సర్కార్ అని సెటైర్లు పడుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -