CM KCR: తమిళి సై వర్సెస్ కేసీఆర్ మధ్య ముదిరిన వార్..టీఆర్ఎస్ టార్గెట్‌గా గవర్నర్ విమర్శలు

CM KCR: తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య నెలకొన్న విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తమిళి సై రాజ్ భవన్‌లో ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్‌పై దమ్మెత్తిపోశారు. సీఎం కేసీఆర్ తీరుపై ఘాటు విమర్శలు చేయడం సంచలనంగా మారింది. రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య ఎప్పటినుంచో దూరం కొనసాగుతోండగా.. తాజాగా గవర్నర్ తమిళి సై ఏకంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించేందుకు ప్రెస్‌మీట్ పెట్టడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ పాలనను ఆమె విమర్శించారు.

 

తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫొన్ కూడా ట్యాప్ అవుతుందనే అనుమానం కలుగుతోందని, తన ఫొన్ ట్యాప్ చేసుకున్నా తనకు ఎలాంటి భయం లేదన్నారు. తాను ఎలాంటి కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం లేదని, ఫోన్ ట్యాప్ చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. కావాలంటే తన ఫోన్ ఇస్తానని, చెక్ చేసుకోవచ్చంటూ తమిళి సై తెలిపారు. యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుపై కూడా తమిళి సై స్పందించారు.

 

బిల్లులపై తనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, దానికి ఒక టైమ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదని తమిళి సై తెలిపారు. ఒక నెల బిల్లు ఆలస్యం చేస్తున్నందుకు విద్యార్థి సంఘాలు రాజ్‌భవన్ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాయని, మరి 8 ఏళ్లు యూనివర్సిటీలో వీసీలను నియమించకుండా ఆల‌స్యం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆందోళనలు చేయరా అంటూ ప్రశ్నించారు. రాజ్‌భవన్ ప్రగతిభవన్‌లా కాదని, ఎప్పుడు, ఎవరైనా వచ్చి తనను కలవొచ్చన్నారు. ఎవరు వచ్చినా అపాయింట్‌మెంట్ ఇస్తమన్నారు. ప్రగతిభవన్‌లా ఇక్కడ డోర్లు మూసి ఉండవంటూ సెటైర్లు పేల్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాజ్ భవన్ లో లాగాలని చూశారంటూ ఆరోపించారు.

 

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -