Shampoo: ఈ షాంపులు యమ డేంజర్‌.. ఇవి వాడితే క్యాన్సర్‌ గ్యారెంటీ!

Shampoo: ఒకప్పుడు తలాంటు స్నానానికి కుంకుడు కాయలను వాడేవారు. వాటితో తల శుభ్రంతో పాటు వెంట్రుకలు బలంగా ఉండేవి. నేటి కాలంలో మార్కెట్‌లోకి రకరకాల షాంపులు, సబ్బులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని వాటినా కొందరికి వెండ్రుకల సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ప్రకటనలు, టీవీల్లో వచ్చే యాడ్స్‌లల్లో చూసి కూడా చాలా మంది వివిధ రకాల షాంపులు వాడుతుంటారు. అయితే కొన్ని పాంపులు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. తలంటు స్నానం చేసిన తర్వాత కొన్ని రోజులకు వెండ్రులు రాలిపోవడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతుంటాయి.

అందుకే షాంఫులు వాడే ముందు మనం వాడే షాంపులో ఎలాంటి రసాయనాలు కలిసి ఉన్నాయో పూర్తిగా తెలుసుకుని వాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల వెల్లడైన ఓ పరిశోధనలో కొన్ని పాంపులు వాడటంతో క్యాన్సర్‌ బారిన పడుతున్నారని స్పష్టమైంది. డ్రై పాంపూ ఉత్పత్తులైన డోవ్‌ నెక్సస్, ట్రెస్మె, టిగి, సువావేలలో క్యాన్సర్‌ కెమికల్‌ ఉందని హిందూస్థాన్‌ యూనిలీవర్‌ గుర్తించడం ఇప్పుడు అందరికి షాక్కు గురి చేస్తోంది. ఈ దెబ్బతో మార్కెట్‌ నుంచి భారీగా షాంపులను కంపెనీ రీకాల్‌ చేసింది. ఏరోసోల్‌ డ్రై షాంపు ప్రొడక్ట్‌లు చాలా ప్రమాదమని, వాటిని వాడవద్దని వినియోగదారులను హెచ్చరించింది.

యూనిలీవర్‌కు చెందిన అనేక పాంపూ బ్రాండ్లలో బెంజీన్‌ అనే క్యాన్సర్క్‌ కారణమయ్యే ప్రమాదకరమైన రసాయనం ఉందని గుర్తించారు. డోవ్‌ నెక్సస్, సువే, టిగితో సహా ట్రెస్మెమ్మె ఏరోసోల్లతో సహా యూఎస్‌ మార్కెట్‌ నుంచి కంపెనీ అనేక డ్రై షాంపూలను రీకాల్‌ చేసింది.ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌లో పోస్టు చేసిన నోటీసు ప్రకారం… యూనిలీవర్‌ ఉత్పత్తులు అక్టోబర్‌ 2021కి ముందు తయారు చేయడం జరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రిటైలర్లకు çసరఫరా చేసినట్లు పేర్కొంది. డ్రై పాంపూ అంటే ఒక పౌడర్‌ లేదా స్పీ లాంటిది. ఈ ఉత్పత్తులు సాధారణంగా జుట్టును తడి చేయకుండా శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారని చెబుతున్నారు. క్లీవ్‌ ల్యాండ్‌ అనే ఒక హెయిర్‌ క్లినిక్‌ వివరాల ప్రకారం.. ఈ ఆల్కహాల్, స్టార్చ్‌ ఆధారిత స్త్రీలు జుట్టు నుంచి జిడ్డు, నూనెను తొలగిస్తాయట.

అయితే కొన్ని డ్రై పాంపూలలో ఏరోసోల్‌ స్పే ఉంటుంది. మరికొన్ని పాంపూలలో జుట్టు రంగుకు సరిపోయేలా పౌడర్‌ లేతరంగులో ఉంటుందట. ఇందులో ఉండే రసాయనాలు ముక్కు, నోరు, చర్మం ద్వారా ద్వారా శరీంలోకి ప్రవేశించి బ్లడ్‌ క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎపీడీవీ) హెచ్చరించింది. గత 18 నెలల్లో ఏరోసోల్‌ సన్‌స్క్రీన్లు మార్కెట్‌ ప్రొడక్టులు వెనక్కి రప్పించాయి. ఇందులో ముఖ్యంగా జాన్సన్‌ – జాన్సన్స్‌ న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్‌ పర్సనల్‌ కేర్‌ కంపెనీ బనానా బోట్, బీర్స్‌డార్ఫ్‌ ఏజీ యొక్క కాపర్‌టోస్‌ వంటి అనేక ఏరోసోల్‌ సన్‌ స్రీన్లను రీకాల్‌ చేయించినట్లు నివేదికల్లో స్పష్టమైంది.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -