Secrets: ఈ 5 సీక్రెట్లు మీ భాగస్వామికి అస్సలు చెప్పకండి?

Secrets: సాధారణంగా భార్యాభర్తల మధ్య దాపరికాలు అనేవి ఉండకూడదు అని చెబుతూ ఉంటారు. అలా అని అన్ని విషయాలు చెప్పడం మంచి పద్ధతి కూడా కాదు అంటున్నారు నిపుణులు. కొన్ని రకాల విషయాలను చెప్పకపోవడం మంచిదని అంటున్నారు. కొన్ని కొన్ని విషయాలలో చెప్పడం వల్ల సంసార జీవితం నాశనమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. మీ భర్త లేదా భార్య మీతో ఎంత పాజిటీవ్‌గా ఉన్నప్పటికీ వారికి మీ గతం గురించి బాగా తెలిసినా సరే వారి వద్ద అస్సలు ఓపెన్‌గా ఉండకూడదు. ముఖ్యంగా ఈ ఐదు విషయాలను వారితో అస్సలు పంచుకోకూడదు. కొంతమంది తమ పార్టనర్ల గతాన్ని తెలుసుకోడానికి కొన్ని సీక్రెట్లను చెబుతారు.

మరి ముఖ్యంగా ఈ ఐదు అంశాలను మీ పార్టనర్‌తో అస్సలు చెప్పకపోవడమే మంచిది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొంతమంది పెళ్లయిన తర్వాత కూడా తమ మాజీ లవర్స్‌తో స్నేహం చేస్తుంటారు. కానీ ఈ విషయాలను పార్టనర్‌కు తెలియకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ మాజీ ప్రేమికులతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నా సరే మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకొనే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాలు చెప్పకపోవడమే మంచిది. అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని హేళన చేయకూడదు. ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ లోపం గురించి చాలామంది చర్చించడానికి ఇష్టపడరు.

 

కాబట్టి మీ పార్టనర్‌ రూపం గురించి గానీ, అవయవ లోపం గురించి కానీ శరీరాకృతి గురించి గానీ హేళన చేయకూడదు. అలా చేయడం వల్ల వారు లోపల కుమిలిపోతారు. దానిని వారు మనసులో పెట్టుకోవడం వల్ల వల్ల మీ పార్టనర్ క్రమేనా మీకు దూరం కావచ్చు. మీ మీద మంచి అభిప్రాయాన్ని కోల్పోవచ్చు. అలాగే ఎప్పుడూ కూడా మగవారు అత్తింటి వాళ్ళను విమర్శించకూడదు. భార్యాభర్తల్లో సగానికి సగం పైగా జంటల్లో గొడవలు అత్తమామల వల్లే ఏర్పడుతూ ఉంటాయి. భర్త తరపున అత్తింటి వాళ్ళనే విమర్శిస్తూ ఉంటారు. అదే పని భర్తలు చేస్తే మాత్రం సహించలేరు. మహిళలు అలా విమర్శించడానికి అక్కడి ప్రతికూల పరిస్థితులు కూడా కారణం కావచ్చు. ఏది ఏమైనా తల్లిదండ్రులను ఎవరైనా విమర్శిస్తే ఎవరూ సహించలేరు. కాబట్టి అలా విమర్శించకపోవడమే మంచిది. అలాగే సెక్స్ కి సంబంధించిన సీక్రెట్ ను చెప్పకూడదు. వాటిని తమ భాగస్వామి వద్ద బయట పెట్టకపోవచ్చు. దీంతో చాలామంది పోర్న్ వీడియోలు చూస్తూ స్వయంతృప్తి పొందుతుంటారు. దీన్ని భాగస్వామి వద్ద గోప్యంగానే ఉంచుకోవాలి. ఇది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. అలాగే శృంగార విషయంలో సలహాలు ఇవ్వడం తీసుకోవడం లాంటివి చేయకపోవడమే మంచిది. మీ పార్టనర్ మీరు కోరుకునే విధంగా శృంగారంలో పాల్గొనలేకపోవచ్చు. అయితే, దీనిపై మీరు పదే పదే విమర్శ చేస్తూ క్లాస్ పీకొద్దు. దీనివల్ల వారి అహం దెబ్బతింటుంది. ఒక వేళ మీరు మీ శృంగార అనుభవాన్ని ఉదాహరణగా చూపించి ఏదైనా చిట్కాలు చెప్పేందు ప్రయత్నిస్తే మాత్రం అడ్డంగా బుక్కైపోతారు. కాబట్టి ఇద్దరికి నచ్చిన విధంగానే శృంగారాన్ని ఎంజాయ్ చేయడం మంచిది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -