Weekend Releases: ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. దీపావళికి ఈ సినిమాలు చూసేయ్యండి..

Weekend Releases: ఓటీటీ వేదికగా ప్రస్తుతం చాలా వరకు సినిమాలు విడుదల అవుతున్నాయి. చిన్న హీరోల సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాలు సైతం ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో ప్రతి వారం సినిమాలు విడుదల అవుతున్నా.. ఓటీటీలపై ప్రేక్షకుల ఆదరణ, ఆసక్తి ఎక్కడా తగ్గలేదు. కొందరు స్టార్ హీరోలు థియేటర్లలో కంటే ఓటీటీ ప్లాట్‌ఫాంలపైనే సినిమాలు విడుదల చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో కీలక అప్‌డేట్ వచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా ఈ వారం కూడా ఓటీటీల్లో కొత్త సినిమాలు విడుదలై అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలతోపాటు వెబ్‌సిరీస్‌లు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఏ సినిమా ఏ తేదీన విడుదల అవుతాయనే విషయాన్ని ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.

బింబిసార:

స్టార్ హీరో కళ్యాణ్‌రామ్, కేథరిన్, సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బింబిసార’. అక్టోబర్ 21వ తేదీన ఓటీటీలో విడుదల కానుంది. జీ5 ఛానెల్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అలాగే అక్టోబర్ 21న ట్రిప్లింగ్ అనే హిందీ వెబ్‌సిరీస్ రిలీజ్ కానుంది. అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో అక్టోబర్ 21వ తేదీన పెట్టైకాలి అనే తమిళ చిత్రం అలరించనుంది.

ఒకే ఒక జీవితం:

స్టార్ హీరో శర్వానంద్, కమెడియన్లు వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటించిన హిట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’. ఈ సినిమా సోనీలివ్‌లో అక్టోబర్ 21వ తేదీన అలరించనుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారమయ్యే సినిమాలు:

అక్టోబర్ 19: ‘ది స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్ (హాలీవుడ్)

అక్టోబర్ 21: బార్బేరియన్స్ (వెబ్‌సిరీస్-2)

అక్టోబర్ 21: ఫ్రమ్ స్క్రాచ్ (వెబ్‌సిరీస్)

అమెజాన్ ప్రైమ్:

అక్టోబర్ 19: అమ్ము (టాలీవుడ్)

అక్టోబర్ 21: ది పెరిఫెరల్ (వెబ్ సిరీస్)

అక్టోబర్ 21: ఫోర్ మోర్ షాట్స్ (వెబ్‌సిరీస్)

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -