Anjaneya Swamy: ఆంజనేయ స్వామికి ఇష్టమైనవి ఇవి మాత్రమే.. అలా చేస్తే మాత్రం తిరుగులేదంటూ?

Anjaneya Swamy: హిందువులు మంగళవారం రోజున ఎక్కువగా ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మంగళవారం రోజున స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. మంగళవారం రోజు హనుమంతుడికి నమస్కారం చేసుకుంటే, ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది. మంగళవారం హనుమంతటిని పూజిస్తే కష్టాల నుండి బయటపడవచ్చు. ఆంజనేయస్వామిని మంగళవారం ఆరాధిస్తే ఎలాంటి బాధలున్నా సరే బయటపడవచ్చు.

ఆరోజు హనుమంతుడి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని పెట్టుకుంటే కూడా మంచిది. మంగళవారం రామనామం జపిస్తే హనుమంతుడు ప్రీతిపాత్రుడై నిరంతరం వారికి తోడుగా ఉంటాడు. మంగళవారం రాముడికి కేవలం ఒక్క నమస్కారం పెడితే చాలు. హనుమంతుడు ఆ కుటుంబానికి రక్షణగా ఉంటాడు. మంగళవారం నాడు హనుమంతుడిని, దుర్గాదేవిని ఆరాధిస్తే జాతక దోషాలు, గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇలాంటి బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించవచ్చు. అదేవిధంగా మంగళవారం నాడు దుర్గాదేవికి ఇష్టమైన పాయసం, పులిహోర, గారెలు నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి. కోరికలు కూడా నెరవేరుతాయి.

 

అలాగే శుభాలు కలిగి కోరికలు నెరవేరాలంటే, క‌చ్చితంగా ఒక్క విషయాన్ని తప్పకుండా పాటించాలి. హనుమంతుడి ఆలయంలో మంగళవారం నాడు అరటి గెల సమర్పిస్తే అనుకున్న కోరికలు పూర్తవుతాయి.
మంగళవారం పూజ గదిలో హనుమంతుడికి అరటి పండ్లు, పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తే, సంపదకి ఎటువంటి లోటు ఉండదు. మంగళవారం నాడు హనుమాన్ చాలీసాని 11 సార్లు పారాయణం చేస్తే, స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలానే ప్రమాదాల నుండి రక్షణని కూడా పొందుతారు. ఇలా ఇక్కడ చెప్పినట్లుగా మీరు మంగళవారం నాడు పాటించినట్లయితే కచ్చితంగా మీకు అంతా శుభమే జరుగుతుంది. ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. ఆనందంగా ఉండవచ్చు. కష్టాల నుండి గట్టెక్కి సుఖసంతోషాలని పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -