Relationship: మహిళల్లో శృంగార ఆసక్తి తగ్గడానికి కారణాలు ఇవే?

Relationship: సాధారణంగా భార్యాభర్తల మధ్య శృంగారం అన్నది ఎంతో కీలకమైనది. అయితే పెళ్లయిన మొదట్లో కొన్నాళ్లపాటు శృంగారం పై ఆసక్తి చూపిన భార్యాభర్తలు ఆ తర్వాత శృంగారానికి నిరాకరిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు స్త్రీలు శృంగారానికి నిరాకరిస్తే మరి కొన్నిసార్లు పురుషులు శృంగారానికి నిరాకరిస్తూ ఉంటారు. స్త్రీలు దగ్గరికి కూడా రానివ్వరు. అయితే దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. శారీరక లేదంటే మానసిక సమస్యలు కూడా కావచ్చు. కొంతమంది భాగస్వామి శృంగారానికి నిరాకరించినప్పుడు వారితో గొడవ పడుతూ ఉంటారు. అలా కాకుండా ఆ సమయంలో వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

అయితే మహిళలకు శృంగారంపై ఎందుకు నిరాశక్తి కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మామూలుగా మహిళలు ఏ కారణం చేతైనైనా భాగస్వామిమీద కోపంతో ఉంటే కనీసం తమను తాకనివ్వడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి సందర్భాల్లో భర్త వచ్చి బుజ్జగించినా లాభం ఉండదు. దూరంగా నెట్టేస్తారు. పురుషులకు ఎంత అహం ఉంటుందో స్త్రీలకూ అంతే అహం ఉంటుంది. ఆ అహం దెబ్బతిన్న సందర్బాల్లో అది కూడా జీవిత భాగస్వామి కారణంగా దెబ్బతింటే శృంగారం పై పూర్తిగా నిరాశక్తిని చూపిస్తూ ఉంటారు. సెక్స్ విషయంలో భర్తను ముప్పు తిప్పలు పెడుతుంటారు. స్త్రీలకు సెక్స్ అంటే కేవలం శారీరకమే కాదు భావి జీవితం కూడా.

 

అందుకే భాగస్వామినుండి నిబద్ధతను కోరుకుంటారు. భవిష్యత్ గురించి అవగాహన లేకపోయినా, ఆ విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా శృంగారానికి అంత ఆసక్తి చూపించరు. మరి ముఖ్యంగా స్త్రీలు నెలసరి సమయంలో మహిళలు కోపంతో ఉన్న సింహాల్లా ఉంటారు. ఆ సమయంలో వారికి విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇవి శృంగారాసక్తిని తగ్గిస్తాయి. అలాగే పని ఒత్తిడి, ఇల్లు, పిల్లల ఒత్తిడి వల్ల సెక్స్ పట్ల మహిళల ఆసక్తి తగ్గుతుంది. టెస్టోస్టెరాన్ పురుషులు, స్త్రీలలో లైంగికతను ప్రభావితం చేస్తుంది. 30 ల మధ్యలో స్త్రీలలో టెస్టోస్టెరాన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దీంతో భాగస్వామిపై ఆసక్తి, కలయికపై ఇష్టం అటోమెటిక్ గా తగ్గిపోతాయి. అలాగే డిప్రెషన్ వంటి మానసిక అనారోగ్యాలు లేదా ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్లు, థైరాయిడ్ వ్యాధులు వంటి అనారోగ్య పరిస్థితులు స్త్రీల్లో లైంగికతను ప్రభావితం చేస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -