Households: ఇంటి ఇల్లాలు పాటించాల్సిన విషయాలు ఇవే?

Households: భారతదేశంలో వాస్తు శాస్త్రాన్ని నమ్మని వారితో పోల్చుకుంటే నమ్మే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. ప్రతి ఒక విషయంలో వాస్తు శాస్త్రాన్ని విశ్వసిస్తూనే ఉన్నారు. కొందరు వాస్తు శాస్త్రాలను కూడా మూఢనమ్మకాలు అంటూ కొట్టి పాటిస్తుంటారు. అయితే వాస్తు శాస్త్ర ప్రకారంగా ఆ విషయాలను పరిహారాలను పాటించడం వల్ల ఆర్థికపరమైన సమస్యలను తొలగించుకోవడంతో పాటు, సంతోషంగా ఉండవచ్చు. వాస్తు శాస్త్రాన్ని కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా కార్యాలయాలు, నిర్మాణాలు అలాగే వ్యాపార స్థలాలలో కూడా పాటిస్తూ ఉంటారు.

మరి కొత్తగా పెళ్లయి స్త్రీలు ఎటువంటి విషయాలను పాటించాలి. ఎటువంటి విషయాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లోని స్త్రీలు కంటతడి పెట్టకుండా సంతోషంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక మహిళలు ఉదయాన్నే లేచి శుభ్రం చేసి తలంటు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. అయితే మహిళలు కొన్ని రకాల విషయాలను పాటించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఇంటి ఇల్లాలు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేయడంతో పాటు వాకిలి కూడా క్లీన్ చేసి ముగ్గులు పెట్టాలి. అనంతరం స్నానం చేసి దేవుడి ఆరాధన చేయాలి.

 

దేవుడికి దూపదీపం పెట్టిన తర్వాత ప్రసాదం తీసుకున్న తరువాతనే వంట మొదలెట్టాలి. సూర్యోదయం అయిన తరువాత లేదంటే పొద్దెక్కిన తర్వాత మహిళలు నిద్ర లేస్తే ఆ ఇంట్లో దరిద్రం తాండవం చేస్తుంది. మధ్యాహ్నం, సాయంత్రం స్నానం చేయడం, జుట్టువేసుకోవడం చేయకూడదు. సూర్యుడు అస్తమించిన తరువాత తల దువ్వటం వంటివి చేయరాదు. ఇంట్లో వంటపాత్రలు ఎప్పటివి అప్పుడు క్లీన్ చేయాలి. అలాగే ఉతికిన బట్టలు బయట ఆరేసి ఉంటే సాయంకాలం కాగానే బయట నుంచి తీసిలోపల పెట్టాలి. ఇంట్లో రోజుకు ఒక్కసారి అయినా దీపం పెట్టాలి. దీపం కొండెక్కే వరకు ఇంటిని చీపురుతో శుభ్రం చేయరాదు. అలా చేస్తే కొత్త కష్టాలు వస్తాయి. గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడవరాదు. అలా చేస్తే లక్ష్మీ దేవి ఇంట్లోకి రాకుండా పాదరక్షలను చూసి అటు నుంచి అటే వెళ్లిపోతుంది. పైన చెప్పిన విషయాలు ఇంటి ఇల్లాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి లక్ష్మి అనుగ్రహం కలిగిఇంట్లోకి ప్రవేశిస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -