నయనతారనే కాదు.. సరోగసీ ద్వారా పిల్లలను కన్నది వీళ్లే!

అనిర్వచనీయమైన పదం అమ్మ. అమ్మ ప్రేమ అనంతం. అమ్మ ఒడి తొలి బడి . ఇలా అమ్మ గురించి చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైన స్థానం ఏదైనా ఉంది అంటే అది ఒక్క తల్లి స్థానం మాత్రమే.. కొంతమంది సినీ తారలు తల్లి అయ్యే మధుర క్షణాలను అనుభవిస్తూ పిల్లలకు జన్మనిస్తుంటే మరి కొంతమంది సినీ తారలు పిల్లలకు జన్మనిస్తున్నారు. ఇలా కృత్రిమ పద్ధతి అయిన సరోగసి ద్వారా పిల్లలను కన్న హీరో హీరోయిన్లు వీరే వారి గురించి కొన్ని విషయాలు మీకోసం తెలుసుకోండిలా.

1 లక్ష్మీ మంచు:– లక్ష్మీ మంచు సరోగసీ పద్ధతి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చారు.

2 ప్రీతి జింటా :- ప్రీతి జింటా కూడా సరోగసీ ద్వారా వారికి పిల్లలు కలిగినట్టు ప్రకటించారు.

3 అమీర్ ఖాన్:– అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.

4 ప్రియాంక చోప్రా:- ప్రియాంక చోప్రా కూడా సరోగసీ ద్వారా వారికి ఒక పాప పుట్టినట్టు చెప్పారు.

5 షారుక్ ఖాన్:– షారుక్ ఖాన్ దంపతులు మూడవ సంతానం కోసం సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.

6 శిల్పా శెట్టి:- శిల్పా శెట్టి దంపతులు కూడా సరోగసీ ద్వారా వారికి ఒక పాప పుట్టినట్టు ప్రకటించారు.

7 సన్నీ లియోన్:– సన్నీలియోన్ దంపతులు కూడా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు.

8 ఏక్తాకపూర్:– బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.

9 కరణ్ జోహార్:– బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా సరోగసీ పద్ధతిని ఎంచుకున్నారు.

10 తుషార్ కపూర్:-ప్రముఖ నటుడు తుషార్ కపూర్ అప్పుడు కూడా సరోగసి పద్ధతితో ఒక బాబుకి సింగిల్ పేరెంట్ గా ఉన్నారు.

11 నయనతార:– నయనతార దంపతులు ఇవాళ కవల పిల్లలకి జన్మనిచ్చినట్టు ప్రకటించారు. వారు కూడా సరోగసీ ఈ పద్ధతి ద్వారా తల్లిదండ్రులు అయినట్టు సమాచారం. వీళ్ళకు పిల్లలు పుట్టారు అన్న సమాచారంతోనే ఈ సరోగసి అనే అంశం చాలా పెద్దగా వినిపించడం జరిగింది. అయితే నయనతార విగ్నేష్ దంపతులకు నాలుగు నెలల క్రిందటే వివాహం జరగడంతో ఇప్పుడు వీళ్ళు పిల్లలకు ఎలా జన్మనిచ్చారు అబ్బ అనే సందేహంలో ఉన్న ప్రేక్షకులకు నయనతార , విగ్నేష్ లు సరైన రీజన్ చెప్పి వాళ్ళని ఆనందింప చేయాలని చాలామంది కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -