Hebah Patel-Payal Rajput: ఆ పాత్రల వల్లే పాయల్ రాజ్ పుత్, హెబ్బా పటేల్ ఇలా ఉన్నారు!

Hebah Patel-Payal Rajput: ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ముందు నుంచి ప్రేక్షకులను మెచ్చే పాత్రను చేస్తూ కెరీర్ పరంగా ముందుకు వెళుతూ ఉంటారు. అలా కొంతకాలం సంప్రదాయకరమైన పాత్రలు చేసి.. చాలాకాలం గడిచిన తర్వాత వాళ్లు గ్లామర్ రోల్స్ కి అలవాటు పడతారు. మరి కొంతమంది హీరోయిన్లు స్టార్టింగ్ నుంచే బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తారు. అంతేకాకుండా ప్రేక్షకులు కూడా వారి తర్వాత చిత్రాన్ని అదే బోల్డ్ గా ఊహించుకుంటారు.

నిజానికి ఒకసారి బోల్డ్ గా ఇండస్ట్రీలు అడుగు పెట్టిన తర్వాత నార్మల్ పాత్రలను చేయడం అంటే చాలా కష్టం. ప్రేక్షకులకు కూడా అంతగా చూడడానికి అనిపించదు. అందుకని కొంతమంది హీరోయిన్లు ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ఉదాహరణకు సమంత మొదట లవ్ స్టోరీస్ ను ఎంచుకొని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వచ్చింది. ప్రస్తుతం నాగచైతన్యతో సమంత విడిపోయిన తర్వాత గ్లామర్ రోల్స్ చేస్తూ.. బోల్డ్ గా కుర్ర కారుని ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది.

కానీ చాలామంది హీరోయిన్లు బోల్డ్ కంటెంట్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తర్వాత అటువంటి తాలూకా సినిమా ఆఫర్లు అంతగా దక్కించుకోలేకపోతున్నారు. ఇక నార్మల్ పాత్రలు చేయడానికి కూడా వారిని ప్రేక్షకులు అంతగా యాక్సెప్ట్ చేయరు. ఇక ఇదే క్రమంలో పాయల్ రాజ్ పుత్ మొదట ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ బోల్డ్ కంటెంట్తో ప్రేక్షకులను ఊహించిన స్థాయిలో ఆకట్టుకుంది.

అనంతరం ఆర్డిఎక్స్ అదే ఓల్డ్ కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను అంతగా ఆట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడు అంతగా సినిమా ఆఫర్లు అందుకోలేదు. ఇక ఇదే క్రమంలో హెబ్బా పటేల్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ అమ్మడు కుమారి 21ఎఫ్ సినిమాతో బోల్డ్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆ తర్వాత లవ్ స్టోరీ లు ఎంచుకున్నప్పటికీ వాటితో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక వీరిద్దరూ హీరోయిన్లు ఆ పాత్రలు ఎంచుకోవడం వల్లే కేరీర్ పరంగా పూర్తిగా లాస్ అయినట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -