Adipurush: ఈ మాటలే ఆదిపురుష్ కు శాపం.. ఇప్పటికైనా అర్థం కావట్లేదా?

Adipurush: డైరెక్టర్ ఓం రౌత్, హీరో ప్రభాస్ కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఇందులో కృతి సనన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. అయితే సినిమా విడుదల అయితే అయింది కానీ టీజర్ విడుదల అయినప్పటి కంటే ఎక్కువ శాతం విమర్శలను నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంటోంది. ఈ సినిమా బాగుంది అని కామెంట్ చేసేవారు కొందరు అయితే అసలు ఇది రామాయణమే కాదు అంటూ విమర్శించే వారు మరి కొంతమంది.

దీంతో పలువురు నెటిజెన్స్ ఈ సినిమా డైరెక్టర్ పై భారీ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే ఆదిపురుష్ రచయిత మనోజ్ పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాగా రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా, ఇన్ని విమర్శలు వస్తున్న తర్వాత కూడా తన తీరును సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి కొన్ని డైలాగులు సినిమానే భ్రష్టు పట్టిస్తుండగా వాటిని మార్చనున్నట్లు సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. అయితే చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా, అసహ్యమైన డైలాగులు రాసి, వాటిని మార్చవలసి వచ్చినా కూడా సదరు రచయిత మాత్రం అహంకారాన్ని వీడడం లేదు.

 

ఆదిపురుష్ కోసం నేను 4000 లైన్లు డైలాగులు రాశాను. వాటిలో 5 లైన్లు కొందరిని బాధించాయని తెలుస్తోంది. రాముడిని, సీతమ్మను కీర్తించిన చాలా సంభాషణల కంటె ఇవే బాధించాయని అనిపిస్తోంది. నా సోదరులు నన్ను ఘోరంగా విమర్శిస్తున్నారు అంటూ మనోజ్ ట్వీట్ లో రాసుకొచ్చారు. ఈ మాట దగ్గరే ఆయన అజ్ఞానం బయటపడుతోంది. రామాయణం వంటి చిత్రానికి డైలాగులు రాసినప్పుడు వాటిని సంఖ్యాపరంగా ఎన్ని లైన్లు అనే తూకంతో చూస్తే కుదరదు. ఆయన చెప్పింది నిజమే అయినా, కేవలం ఆ అయిదు లైన్లే.. నాలుగువేల లైన్ల సారాంశాన్ని సర్వనాశనం చేసేసాయని ఆయన ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారో అర్థం కాని సంగతి.

 

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -