Fatburning foods: ఇలా చేస్తే మీరు ఇట్టే బరువు తగ్గిపోతారు!

Fatburning foods: ప్రస్తుత జీవన శైలి కారణంగా అనేక మంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. దీని వల్ల సమాజంలో పది మందిలో కలవాలన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంటారు. శరీర భాగాల్లో ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. దీన్నే ఊబకాయం అని పిలుస్తారు. ఇలా అధిక బరువు పెరగడం వల్ల గుండెజబ్బులు త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. మధుమేహం లాంటి దీర్ఘ కాలిక సమస్యలూ వస్తాయి.

 

బరువు తగ్గడం కోసం చాలా మంది చాలా రకాల పద్ధతులు పాటిస్తుంటారు. ముఖ్యంగా త్వరగా బరువు తగ్గాలనే తాపత్రయంలో తప్పుడు మార్గాలను కూడా పాటిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొత్త సమస్యలు వచ్చి పడే అవకాశం ఉంటుంది. తీసుకొనే ఆహారంలో మార్పులు, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవన శైలితో బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.

 

ముఖ్యంగా మనం తీసుకొనే ఆహారంలోని కొన్ని పదార్థాలు శరీరంలోని కొవ్వును కరిగించేందుకు దోహదం చేస్తాయి. ఇలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గే క్రమంలో మంచి ఫలితాలను పొందవచ్చు. వాటిలో మొదటి స్థానంలో గుడ్డు ఉంటుంది. రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఊబకాయంతో బాధపడుతున్న వారు రోజూ కనీసం మూడు గుడ్లు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గ్రీన్ టీతో బెటర్ రిజల్ట్స్..
రోజూ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కూడా బరువు పెరగకుండా ఉంటారు. గ్రీన్ టీలో ఎపిగాల్లో కాటెిన్ గాలేట్ అనే శక్తవంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన బాడీలోని కొవ్వు కరిగించడానికి ఎంతగానో దోహదం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీతో పాటు కారం పొడి, ఆలివ్ ఆయిల్, కాఫీ లాంటివి తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గడానికి వీలుంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -