Hyderabad: నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ జంటే.. ఏం జరిగిందంటే?

Hyderabad: ప్రస్తుత కాలంలో యువతి యువకులు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే మరి కొంతమంది తల్లిదండ్రుల కోసం ప్రేమించిన వారిని కాదని వేరొకరిని పెళ్లి చేసుకొని వారితో కలిసి బతకలేక విడాకులు కూడా తీసుకుంటున్నారు. అయితే కొంతమంది ఇలా భర్తలకు దూరమైన తర్వాత మళ్ళీ ప్రేమించిన వారితో కలిసి జీవించడానికి ఆశపడుతున్నారు.

ఈ కట్టుబాట్లు సాంప్రదాయాల వల్ల ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. కట్టుకున్న వాడితో కాపురం చేయడం ఇష్టం లేక విడాకులు తీసుకున్న మహిళ ఆ తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకుని జీవించలేక అతనితో కలిసి ఆత్మహత్య చేసుకుంది.

 

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిధిలోని గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన జ్యోతి (22) అనే యువతి అదే గ్రామానికి చెందిన శ్యామ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే ఆమె తల్లిదండ్రులు మూడేళ్ల కిందట వేరే యువకుడితో వివాహం జరిపించారు. కానీ, పెళ్లైన కొన్నాళ్లకే జ్యోతి భర్తతో ఉండడం ఇష్టం లేక అతనికి విడాకులు ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి చాలా కాలం పాటు తల్లిదండ్రుల వద్దే గడిపింది.ఇక ఇటీవల జ్యోతి ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లింది. ప్రియురాలు వెళ్లిన కొన్ని రోజులకే శ్యామ్ కూడా హైదరాబాద్ వెళ్లాడు.

 

ఇద్దరు వేరు వేరు సంస్థలో ఉద్యోగాలు చేస్తూ హాస్టల్ లో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల శ్యామ్ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శ్యామ్ స్నేహితుడైన వంశీ ఊర్లో లేకపోవడంతో అతనితో తాళాలు తీసుకొని ఇద్దరు కూడా వంశీ గదికి వెళ్లారు. అయితే వారిద్దరూ కలిసి జీవించడానికి పెద్దలు ఒప్పుకోలేదన్న బాధతో ఇద్దరూ కూడా అదే గదిలో ఆత్మహత్య చేసుకొని మరణించారు. మరుసటి రోజు జ్యోతి కోసం ఆమె తమ్ముడు ఫోన్ చేయగా జ్యోతి కనిపించకపోవడంతో ఆమె కోసం తీవ్రంగా గాలించాడు. చివరికి వంశీ గదిలో ఇద్దరు శవాలుగా కనిపించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -