Farmer: ఈ రైతు సక్సెస్ ను మెచ్చుకోవాల్సిందే.. అలా సంపాదిస్తున్నాడా?

Farmer: సాధారణంగా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటారని చాలామంది పొరబడుతూ ఉంటారు. అయితే డబ్బులేని పేదవాళ్లు కూడా తమ తెలివితేటలతో జీవితంలో విజయం సాధించే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా కటిక పేదరికం నుండి పుట్టి రెండు కళ్ళు లేకపోయినా కూడా జీవితంలో సక్సెస్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు మీర్జాపూర్ జిల్లా కి చెందిన బసంత్.

 

బసంత్ మీర్జపూర్ జిల్లాలోని బట్టలో గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అంతే కాకుండా బసంత్ కి పోలియో సోకటం వల్ల అతని రెండు కాళ్ళు కోల్పోయాడు. అయితే వికలాంగుడైన బసంత్ తన జీవితం గురించి నిరాశ చెందకుండా చదువులో కూడా రాణించాడు. ఆర్థిక ఇబ్బందులు వల్ల మూడూ పూటలా తిండి తినలేని పరిస్థితులలో కూడా చదువు మీద ఏకాగ్రత తప్పకుండా బి ఏ పూర్తీ చేసాడు. అంతటితో ఆగకుండా ఆ తర్వాత ఐటిఐ కూడా పూర్తి చేశారు.

ఇలా ఐటిఐ పూర్తిచేసిన బసంత్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే అతను చేసిన ప్రయత్నాలు అన్ని అయ్యాయి. అయితే ఉద్యోగం రాలేదని బసంత్ నిరాశ చెందక పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో పుట్టగొడుగుల పండిస్తున్న రైతులతో మాట్లాడారు. పుట్టగొడుగుల పెంపకానికి పెట్టుబడి ఎక్కువ , భూమి అవసరం లేదని తెలుసుకుని పుట్టగొడుగుల సాగుని మొదలుపెట్టారు.పుట్టగొడుగుల పెంపకంలో మరింత నైపుణ్యత సాధించడం కోసం బసంత్ రాంచికి చెందిన ఐబిఆర్ నుండి శిక్షణ కూడా తీసుకున్నారు.

 

ఆ తర్వాత బసంత్ పుట్టగొడుగుల పెంపకం తయారు చేయడం మొదలుపెట్టారు. దీంతో అతని ఆదాయం రెట్టింపు అయింది. ఇలా క్రమంగా తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ ఇప్పుడు ఏడాదికి లక్షన్నర రూపాయలు పొదుపు చేస్తున్నారు. అంతే కాకుండా పుట్టగొడుగుల పెంపకం పై శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ శిక్షణ ఇవ్వడం ద్వారా కొంతమందికి ఆదాయం కూడా వస్తోంది. రెండు కాళ్ళు లేకపోయినా కూడా బసంత్ జీవితం పట్ల నిరాశ చెందకుండా కష్టపడి పనిచేసి తాను అనుకున్నది సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -