Tollywood: టాలీవుడ్ లో టైర్ వన్ కి ఎంటర్ అయ్యే సత్తా ఉన్న ఐదుగురు హీరోలు వీళ్లే!

Tollywood: టాలీవుడ్ లో చాలామంది హీరోలు అడపాదడప హిట్ లు కొడుతూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. ఇక వరుస సినిమా ఆఫర్లు అందుకుంటారు కూడా.. కానీ ఈ హీరోలు ఎప్పుడు టైర్ టూ లోనే ఉంటారు. టైర్ వన్ కి ఎంటర్ అయ్యే టాలెంట్ వీళ్ళకి ఉన్నప్పటికీ వీళ్లు టైర్ టు లోనే ఉండిపోతున్నారు. మరి ఇప్పుడు మనం ఆ హీరోల గురించి తెలుసుకుందాం.

నాగచైతన్య మొదటి సినిమాతోనే స్టార్ హీరో స్థాయికి ఎదగాల్సిన సినిమా. తన తొలి సినిమా జోష్ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత నాగచైతన్య పలు సినిమాల్లో నటించినప్పటికీ స్టార్స్ హీరో స్థాయికి ఎదగలేదు. ఇక చైతన్య స్టార్ హీరో అవ్వాలి అంటే తనకి ఒక మంచి మాస్ హిట్ కావాలి. మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి పర్ఫెక్ట్ కాంబినేషన్లో మూవీ చేస్తే చైతన్య టాప్ హీరో స్థాయికి రావడానికి పెద్ద కష్టమేమీ ఉండదు.

ఇక నాచురల్ స్టార్ నాని ఒక సమయంలో వరస హిట్లతో మినిమం గ్యారెంటీ హీరోగా ఒక ముద్ర సంపాదించుకున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నాని.. దాదాపు 7 వరుస హిట్లతో టాప్ హీరో రేంజ్ ను కొల్లకొట్టె స్థాయికి ఎదిగాడు. కానీ కృష్ణార్జున యుద్ధం సినిమా ఈ స్థాయిని మొత్తం వెనక్కి నెట్టింది. ఇటువంటి నానికి ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ లేకపోవడం మైనస్ అయింది. ఇక నాని గట్టిగా ట్రై చేయాలి కానీ టాప్ హీరోల సరసన ఉండిపోతాడు.

ఇక విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకొని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత గీతగోవిందం సినిమాతో మరో హిట్ ను తన సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత విజయ్ కు అన్ని ఫ్లాప్ లే మిగిలాయి. ఇతడికి సరైన హిట్టు పడితే టాప్ హీరో స్థాయికి దూసుకు వెళ్లే అవకాశం ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -