బరువు తగ్గించేందుకు ఈ పిండి సహాయపడుతుందంటా!

ప్రస్తుత కాలంలో ఉద్యోగలన్నీ ఉరుకులు పరుగులు లేవు. చాలా మందికి శారీరక శ్రమ ఉండటం లేదు. కొందరు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొంత సమయం కేటాయించి వ్యాయామాలు చేస్తున్నారు. అధిక సంఖ్యలో శరీరంపై ఆశ్రద్ధ చూపడంతో ఊబకాయం, పొట్టలు వస్తున్నాయి. వాటిని తగ్గించుకునేందుకు వివిధ రకాల కసరత్తుల్లో నిమగ్నమవుతున్నారు. వాటికోసం డైట్‌ చేయాలని నిర్ణయించుకుంటుని ఎక్కువగా చపాతీ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కేవలం గోధుమ పండితోనే కాకుండా ఇతర పిండిలతో కూడా శరీరాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

జొన్న రొట్టె..

జొన్న రొట్టే తెలియని వారుండరు. చాలా మంది ఇతర పిండిలతో చేసే రొట్టేకన్నా జొన్న రొట్టెలను తింటున్నారు. ఎందుకంటే దానితో వచ్చే ఫలితం అలాంటిది. జొన్నల్లో ఎక్కువగా ప్రొటీన్‌, ఫైబర్‌, క్యాల్షియం, ఐరన్‌ ఉంటాయి. గతంలో జొన్న రొట్టేలు తయారు చేసేందుకు ఇబ్బందులు అవుతోందని వాటిని తినాలని ఉన్నా తినలేకపోయేవారు. ప్రస్తుతం జొన్న రొట్టెలు మార్కెట్లలో హోటళ్లలో సులువుగా దొరుకుతుండటంతో అందరూ వాటిని తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

ఓట్స్‌..

హెల్దీ డైట్‌, వెయిట్‌ లాస్‌ అనగానే ఇప్పుడు అందరి చూపు ఓట్స్‌ వైపే. వీటితో వెయిట్‌ లాసే కాక షుగర్‌ను కూడా అదుపు చేస్తోంది. ఓట్స్‌లో సోల్యూబుల్‌ ఫైబర్‌, ఇన్‌ సోల్యూబుల్‌ ఫైబర్స్ ఉంటాయి. తరచూ ఆకాలి కాకుండా నియంత్రిస్తాయి.

సజ్జలు..

తాత, ముత్తాతలు వాడిన ఆహారపు అలవాట్లే ఎంతో శ్రేష్టమైనవి. ఎందుకంటే అప్పుడు వారు తినే దాంట్లో ఎలాంటి కల్లీ ఉండేది కాదు. నాడు ఎక్కువ తినే సజ్జలు కూడా బరువును తగ్గిస్తాయి. సజ్జలు కూడా గ్లూటెన్‌ ఫ్రీ ఇందులో ప్రోటీన్‌, ఐరన్‌, మ్యాగ్నీసియం, ఫైబర్‌ అధికంగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా శరీరానికి ఎంతో మంచివి.

రాగిపిండి..

రాగి పిండి కూడా ఎంతో చక్కని ఫలితాన్ని ఇస్తుంది. రాగి పిండి కూడా గ్లూటెన్‌ ఫ్రీ. రాగి పిండిలో ఫైబర్‌, అమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. రాగి పిండిని వాడటంతో త్వరగా కడుపు నిండిపోయినట్లు అనిపిస్తోంది. బరువు కూడా త్వరగా తగ్గించవచ్చు.

బాదం పిండి..

బరువు తగ్గడమే కాదు.. శక్తివంతంగా ఉండాలంటే బాదం పిండి మంచిదే. బాదం పిండిలో విటమిన్‌-ఏ, మెగ్నీషియం, ఫైబర్‌ ఎక్కువ మొతాదులో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో సోడియం ఉండదు. దీన్ని తినడంతో శరీరంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరగదంటున్నారు వైద్య నిపుణులు. దీని ద్వారా బరువు కూడా ఎక్కువగా పెరగదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -