Telangana: తెలంగాణ ఉద్యోగులకు షాక్ ఇదే.. అలా చేయబోతున్నారా?

Telangana: తెలంగాణలో పరస్పర వ్యతిరేక భావన పెరిగి పోవడం వల్ల అధికార పార్టీ బీఆర్ఎస్ కు ఉద్యోగులకు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతోంది. ఉద్యోగులకు ఎంతచేసినా సంతృప్తి ఉండదని, ఉద్యోగులేమీ ప్రభుత్వానికి కృతజ్ఞతా భావంతో మద్దతుగా ఉండరనేది అధికారపార్టీ నేతల ఆరోపణ. ఇదే సమయంలో ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు కావాలనే ప్రభుత్వం తీసుకుంటున్నదని ఉద్యోగసంఘాల నేతలు మండిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే పీఆర్సీ కమిటి నియామకం, డీఏ బకాయిల విడుదల, హెల్త్ స్కీమ్ అమలు, బదిలీలు లాంటి అనేక అంశాలను కేసీయార్ పట్టించుకోవటం లేదు.

బహిరంగ సభలో అలాగే ప్రజలతో మాట్లాడేటప్పుడు ఉద్యోగుల గురించి కేసీఆర్ చాలా గొప్పగా చెబుతాడని, కానీ చేతుల్లోకి వచ్చేసరికి అంతా సూన్యం. మాటలు బాగానే మాట్లాడిన కేసీఆర్ చేతుల విషయానికి వచ్చేసరికి ప్లేట్ ఫిరాయిస్తారని, అందుకే కెసిఆర్ ను కలవటానికి కూడా ఉద్యోగసంఘాల నేతలు పెద్దగా ఆసక్తిచూపరు. జూన్ తో 11వ పీఆర్సీ పదవీకాలం ముగుస్తోంది. జూలైలో 12వ పీఆర్సీ నియామకం జరగాలి. అయితే ఈ దిశగా కేసీయార్ ఇంతవరకు ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. ఇదే విషయమై చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని ఉద్యోగసంఘాల నేతలు కలిసినా ఉపయోగం లేకుండా పోయింది.

కాగా వచ్చే ఎన్నికలలో ఉద్యోగుల స్టాండ్ ఎలా ఉంటుంది అనే విషయమై కెసిఆర్ సమాచారం తెప్పించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో కూడా నెగిటివ్ ఫీడ్ బ్యాకే వచ్చిందట. 2018 ఎన్నికలకు ముందు పీఆర్సీ అమలు చేయకుండానే కెసిఆర్ ఎన్నికలకు వెళ్ళిన దగ్గర నుండి ప్రభుత్వానికి ఉద్యోగులకు గ్యాప్ మొదలైంది. తమకు ఉద్యోగులు ఓట్లేయలేదనే ఫీడ్ బ్యాక్ కేసీయార్ కు ఉండటం వల్లే పీఆర్సీ వేయకుండా బాగా ఆలస్యంచేశారు. అయితే ఉద్యోగులు పెద్దఎత్తున ఒత్తిడి చేయటంతో పీఆర్సీ వేయాల్సొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -