Natu Natu: ఎన్టీఆర్, చరణ్ రేంజ్ ఇదీ.. లండన్ లో ఒకేసారి 700 మంది డ్యాన్స్ స్టెప్పులు వేయడంతో?

Natu Natu: స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమాలతో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు పాన్ ఇండియా హీరోలుగా మారిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఇద్దరు హీరోలకు భారీగా క్రేజ్ ఏర్పడింది.

ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది పూర్తయి కొన్ని నెలలుగా వస్తున్న ఇంకా ఈ సినిమా మేనియా తగ్గడం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న నాటు నాటు పాట క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ పాటకు కొన్ని వందల మంది కలిసి డ్యాన్సులు వేసిన దృశ్యాలు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అసలేం జరిగిందంటే.. తాజాగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకి లండన్‌ వీధుల్లో 700 మంది డాన్స్ వేసి అదరగొట్టారు. ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మహిళలంతా చీరల్లో నాటు నాటు పాటకి కాలు కదిపారు.

 

లండన్‌ లోని 10 డౌనింగ్ స్ట్రీట్ లో ఈ ప్రదర్శన జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఈ వీడియోలను ఇంకా వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలు ఫోటోలను చూసిన ఆర్ఆర్ఆర్ టీం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజమౌళి అభిమానులు ఆ వీడియోలు ఫోటోలు చూసి ఇది కదా రాజమౌళి అంటే అంటూ వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -