Indian Railways: భారతీయ రైల్వేలో భారీ విషాదాలు.. అన్ని వేల మంది చనిపోయారా?

Indian Railways: భారత దేశంలో రైల్వే తన ప్రయాణాన్ని మొదలుపెట్టి సుమారు 170 సంవత్సరాలు అవుతుంది ఇలా 17 దశాబ్దాల కాలం నుంచి ఎన్నో సేవలను అందిస్తున్నటువంటి భారతీయ రైల్వే ఎంతో మంది ప్రయాణికులకు సులువైన రవాణా మార్గంగా మారిపోయింది. అయితే ప్రయాణం అన్న తర్వాత మనుషుల తప్పిదం లేదా సాంకేతిక లోపం కారణంగా అలాగే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రమాదాలు జరగడం సర్వసాధారణం ఈ క్రమంలోని 17 దశాబ్దాల రైల్వే ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే గత మూడు దశాబ్దాలుగా ఇండియన్ రైల్వేలో చోటు చేసుకున్న ప్రమాదాలు కారణంగా కొన్ని వేల మంది మరణాలు పొందారు మరి ఆ సంఘటనలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఫిరోజాబాద్ రైలు ప్రమాదం: 1995 ఆగస్టు 20వ తేదీ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 358 మంది మరణించారు. పురుషోత్తం ఎక్స్ప్రెస్ కదిలింది ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

గౌసల్ రైలు ప్రమాదం: 1999 ఆగస్టు 2వ తేదీ ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అవద్ అస్సాం ఎక్స్ప్రెస్ రైలును బ్రహ్మపుత్ర మెయిల్ ఢీకొట్టడంతో సుమారు 290 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

ఖన్నా రైలు ప్రమాదం: 1998 నవంబర్ 26వ తేదీ పంజాబ్లో జరిగిన ఈ రైలు ప్రమాదంలో సుమారు 212 మంది ప్రాణాలు కోల్పోయారు. కదిలింది ఎక్స్ప్రెస్ రైలును జమ్మూ తవీ సియాల్ది ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొట్టింది.

 

పేరుమాన్ రైలు ప్రమాదం: 1981 జూలై 8వ తేదీ కేరళ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ప్యాసింజర్ రైలు ఐలాండ్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో సుమారు 150 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

 

కాన్పూర్ రైలు ప్రమాదం: 2016 నవంబర్ 20 తేది కాన్పూర్ లో జరిగిన ఈ ప్రమాదంలో ఇందర్ పాట్నా రైలు పట్టాలు తప్పి సుమారు 150 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో కూడా ఇప్పటికే 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే క్షణక్షణానికి మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -