Indian Railways: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వేసవిలో అలా చేసే ఛాన్స్!

Indian Railways: సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు ప్రయాణం కన్నా రైలు ప్రయాణం ఉత్తమమైనది. రైలు ప్రయాణం కొంచెం ఆలస్యమైనా కూడా ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుంది. అలాగే సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. అయితే రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఇప్పుడు ఒక శుభవార్త. రైలు ప్రయాణం చేయాలనుకునేవారు స్లీపర్ టిక్కెట్‌ పై ఏసీ కోచ్‌లో ప్రయాణించే అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. ప్రతిరోజు రైలులో స్లీపర్, జనరల్, ఏసీ తరగతుల్లో లక్ష మంది ప్రయాణిస్తున్నారు.

రైలులో జనరల్ కోచ్ లో ప్రయాణించడానికి ముందుగా రిజర్వేషన్ చేసుకోనవసరం లేదు. అయితే స్లీపర్, AC తరగతిలో ప్రయాణించడానికి ముండుగా రిజర్వేషన్ చేసుకోవాలి. అయితే వేసవికాలంలో రైలు ప్రయాణికులకు రైల్వే డిపార్ట్మెంట్ ఒక శుభవార్త తెలియజేసింది. స్లీపర్ క్లాస్‌లో టికెట్ తో ఏసీ క్లాసులో ప్రయాణించే అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

 

రైల్వే నిబంధనల ప్రకారం, డిపార్ట్‌మెంట్ ద్వారా ప్రయాణికులకు ఆటో అప్‌గ్రేడేషన్ సౌకర్యం కల్పిస్తుంది. మీరు రిజర్వేషన్‌ను చేసినప్పుడు, ఆ సమయంలో ఆటో అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీరు టిక్కెట్‌ను బుక్ చేసుకున్న తరగతి కంటే పై తరగతికి మీ టికెట్ అప్‌గ్రేడ్ చేయబడుతుంది. ఉదాహరణకి మీరు స్లీపర్ క్లాస్‌లో టికెట్ బుక్ చేసుకున్నట్లయితే, మీ టికెట్ థర్డ్ ఏసీ క్లాస్‌కి అప్‌గ్రేడ్ చేయబడుతుంది. అయితే మీరు ఉన్న తరగతి నుంచి మరొక తరగతికి అప్‌గ్రేడేషన్ కోసం, మీరు ఆ తరగతికి రిజర్వేషన్ ఫీజుతో పాటు రెండు తరగతుల మధ్య ఛార్జీల వ్యత్యాసాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది.

 

అలా కుదరని పక్షంలో మీరు TTEని సంప్రదించడం ద్వారా మీ సీటును కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్లీపర్ క్లాస్‌లో ప్రయాణిస్తు.. AC క్లాస్ కి అప్ గ్రేడ్ చేయాలనుకుంటే.. మీరు చేయాల్సిందల్లా ప్రయాణ సమయంలో కంపార్ట్‌మెంట్‌లో ఉన్న TTEని సంప్రదించాలి. స్లీపర్ క్లాస్ నుంచి ఏసీ క్లాస్‌కు వెళ్లాలనుకుంటున్నట్లు టీటీఈకి చెప్పాలి. తగిన ఫీజు చెల్లిస్తే TTE మీకు AC క్లాస్‌లో బెర్త్ కేటాయిస్తారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -