Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో తప్పు వాళ్లదేనా.. ఏం జరిగిందంటే?

Odisha Train Accident: తాజాగా కోరమాండల్ రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటన సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ ఘటనపై ప్రతి ఒక్కరు ద్రిగ్భాంత్రి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదం ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మృతి చెందారు. వందల మంది గాయపడ్డారు. తప్పు ఎవరిదీ అయినా వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తాజాగా రైల్వే శాఖ ఈ ఘటనపై స్పందిస్తూ సిగ్నల్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది.

కమిటీ నివేదిక వచ్చాక ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనలో 900 మంది గాయాల పాలైనట్లు సమాచారం. అయితే దశాబ్ద కాలంలో అత్యంత భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చిన రైలు ప్రమాదం ఇదే కావడం గమనార్హం. ఈ ప్రమాదం గురించి ప్రతిపక్ష పార్టీల నేతలు స్పందిస్తూ సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్యూర్ కావడం వల్లే ప్రమాదం జరిగిందంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. అయితే ఈ మార్గంలో కవచ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

 

కవచ్ వ్యవస్థ ఉంటే పట్టాలు బాగా లేకపోయినా ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నా ఆటోమేటిక్ గా బ్రేకులు పడే అవకాశం ఉంటుంది. దేశంలోని కొన్ని ప్రధాన మార్గాల్లో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఒడిశా రైలు ప్రమాదంలో ఎన్నో హృదయ విదారక ఘటనలు చోటు చేసుకున్నాయి. తల్లి చనిపోవడంతో 14 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన రమేష్ అనే వ్యక్తి తిరుగు ప్రయాణంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కి ప్రాణాలు కోల్పోయారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -