Train: ట్రైన్‌ టికెట్‌పై ఆ పదాలు ఏం సూచిస్తాయో తెలుసా?

Train:  భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. ప్రతి రోజు లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుకుంటుంది. రైలు ప్రయాణం అనేది సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటుంది. తక్కువ ఛార్జీలతో ప్రయాణించే వెసులుబాటు ఒక్క రైల్వేలోనే ఉంది. అందుకే సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే రైలు ప్రయాణం చేయాలంటే ముందు ఐఆర్‌సీటీసీ ద్వారా, టికెట్‌ కౌంట్‌ ద్వారా ముందస్తుగా బుక్‌ చేసుకుంటారు. ఐఆర్‌సీటీసీ, ఇతర ఆన్‌లైన్‌ మార్గాల ద్వారా టికెట్లను బుక్‌ చేసుకున్న టికెట్లు రద్దు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి.

ఎందుకంటే సీట్లను బట్టి మనకు కన్ఫర్మేషన్‌ ఉండదు. కొన్నిసార్లు రద్దీగా ఉండే మార్గం కారణంగా టికెట్స్‌ కన్ఫర్మ్‌ కావడం కష్టంగా ఉంటుంది. అయితే రైలు టికెట్లను రిజర్వేషన్‌ చేసుకున్నప్పుడు సాధారణంగా బెర్త్‌ కన్ఫర్మ్‌ అయితే కన్ఫర్మ్‌ అయినట్లు స్టేటస్‌ చూపిస్తుంది. అలాగే వేయిటింగ్‌ లిస్టులో కూడా కొన్ని పదాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా టికెట్లు బుక్‌ చేసుకున్న సమయంలో పీక్యూడబ్లూఎల్, ఆర్‌ఎల్‌ డబ్ల్యూఎల్, జీఎన్‌డబ్ల్యూఎల్, ఆర్‌ఎల్‌జీఎన్, తదితర పదాలు కన్పిస్తాయి. ఇలాంటి పదాలకు చాలా మందికి అర్థాలు తెలియవు.

జీఎన్‌డబ్ల్యూఎల్‌(జనరల్‌ వేయిటింగ్‌ లిస్ట్‌) :

రైలు టికెట్లను రిజర్వేషన్‌ చేసుకున్న సమయంలో ఈ జీఎన్‌డబ్ల్యూఎల్‌ ఉంటుంది. ఇలా కనిపిస్తే బెర్త్‌ కన్‌ఫాం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అర్థం. రైలు ప్రారంభమయ్యే స్టేషన్‌ లేదా దాని రూట్‌లో ఉన్న ఏదైనా స్టేషన్‌ నుంచి మనం టికెట్లను బుక్‌ చేస్తే వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటే ఇలా మనకు చూపిస్తుంది.

ఆర్‌ఏసీ( రిజర్వేషన్‌ అగనెస్ట్‌ క్యాన్సలేషన్‌)..

ఇలా ఉంటే రైల్వే టికెట్స్‌ కన్ఫర్మ్‌ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆర్‌ఏసీ లో ఉంటే చాలా వరకు టిక్కెట్లు కన్ఫర్మ్‌ అయిపోతాయి. అయితే కొన్ని సందర్భాలలో ఒకే బెర్త్‌లో ఇద్దరికి కేటాయించబడుతుంది. సర్దుబాటు చేసుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి తక్కువ సమయంలో ఎదురవుతుంటాయి.

డబ్ల్యూఎల్‌( వేయిటింగ్‌ లిస్ట్‌)..

ఇది వెయిటింగ్‌ లిస్ట్‌. మీరు టికెట్‌ బుక్‌ చేశాక టికెట్‌ కన్ఫర్మ్‌ కాకపోతే ఇది చూపిస్తుంది. టికెట్లు కన్ఫర్మ్‌ అయిన వారు ఎవరైనా రద్దు చేసుకుంటే మీకు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆర్‌ఎస్‌ డబ్ల్యూఎల్‌ (రోడ్‌సైడ్‌ స్టేషన్‌ వేయిటింగ్‌ లిస్ట్‌)..

రైలు టికెట్‌ బుక్‌ చేసిన తర్వాత వెయిటింగ్‌ లిస్ట్‌లో ఇలా స్థితి ఉంటే ఈ టిక్కెట్లు కన్ఫర్మ్‌ అయ్యేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని అర్థం. రైలు ప్రయాణించే మార్గంలో ఏదైనా స్టేషన్‌లో బెర్త్‌లు ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటే ఇలా చూపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -